ప్రముఖ జర్నలిస్టు,రాజకీయ విశ్లేషకులు బోగాది వెంకట రాయుడు రచించిన మనలో మాట పుస్తక ఆవిష్కరణ రాజమహేంద్రవరం శుభమస్తు కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడి లక్ష్మీనారాయణ, రాజమహేంద్రవరం మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్,మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, గన్ని కృష్ణ,డి.సోమసుందర్, విక్రమ్ పూల లు విచ్చేశారు.
బోగాది వెంకట రాయుడు ముక్కుసూటిగా, నిష్పక్షపాతంగా రాసే వార్తలను వారు ప్రశంసించారు. ఉన్నది ఉన్నట్లుగా రాయడం ద్వారానే ప్రజల్లోనూ, ప్రజా పద్ధతిలోనూ గుర్తింపు పొందగలుగుతారన్నారు. పుస్తకాలకు ఆదరణ తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో బోగాది రచించిన పుస్తకాలకు డిమాండ్ పెరగడం ఆయన ప్రత్యేకతను చాటి చెప్తుందన్నారు.
అయిదు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో బోగాది వార్తలు విశేష గుర్తింపు పొందాయన్నారు. పుస్తక రచయిత బోగాది మాట్లాడుతూ గోదావరి జిల్లా వాసిగా తన కధనాలకు ఇంత గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.