‘లావు శ్రీకృష్ణ దేవరాయలు అను నేను.. లోక్ సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా..’ అంటూ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్లమెంట్ వేదికగా తెలుగులో ప్రమాణ స్వీకారం సోమవారం చేశారు.
ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు స్పందిస్తూ … పల్నాటి ప్రజల అంతులేని అభిమానం, ఆకాశమంతటి ఆధరాభిమానాలు నన్ను మరోసారి గొప్ప విజయంతో పార్లమెంట్ సభ్యునిగా చేశాయి. నా పల్నాటి వాసుల సంక్షేమమే పరమావదిగా, అభివృద్దే ఆలోచనగా నా ప్రతి అడుగు ఉంటుంది. నేను పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణం చేస్తూ లోక్ సభలో నిలబెట్టి నా వెన్నంటే నడిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాపై నమ్మకంతో నా పల్నాట అవకాశం కల్పించి, సముచిత గౌరవం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి నా మనః పూర్వక కృతజ్ఞతలు.