Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతలు

– సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో వైసీపీ నేతల దాడిలో టీడీపీ కార్యకర్త సాకే రామయ్య మృతి బాధాకరం
– పల్నాడులో ఉన్నం లక్ష్మీనారాయణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు

అధికార మదంతో వైసీపీ నేతలు ప్రతిపక్ష టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దమనకాండకు పాల్పడుతూనే ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో వైసీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో చేసిన దాడిలో టీడీపీ కార్యకర్త సాకే రామయ్య మృతి చెందడం అత్యంత బాధాకరం. వైసీపీ నేతల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. వ్యక్తి మరణానికి కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.

అదేవిధంగా పల్నాడు జిల్లా కారంపూడి టీడీపీ మండల అధ్యక్షుడు ఉన్నం లక్ష్మీనారాయణ, సైదాపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చింతపల్లికి చెందిన లక్ష్మీనారాయణ కారంపూడి బస్టాండ్ సెంటర్లో ఉండగా పథకం ప్రకారం వైసీపీ నాయకులు హత్యాయత్నానికి దిగారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డి.. తమ అవినీతి, అక్రమాలను, విధ్వంసాన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా భౌతిక దాడులు చేస్తూ హతమారుస్తున్నారు.

శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనేందుకు రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలే నిదర్శనం. తన సోదరిని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు పదో తరగతి చదివే అమర్ నాథ్ అనే బాలుడ్ని సజీవ దహనం చేశారు. కత్తిపోట్లు, హత్యలు, సజీవ దహనాలు, మానభంగాలు నిత్యకృత్యంగా మారాయి. హింసనే ఆయుధంగా చేసుకున్న వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్ని విషయాన్ని గమనించాలి.

LEAVE A RESPONSE