తాడేపల్లి : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ, టీడీపీ నాయకులు చేరారు.
కె.ఆర్.మురహరి రెడ్డి (ఎమ్మిగనూరు బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జి), కిరణ్ కుమార్ (బీజేపీ ఎమ్మిగనూరు టౌన్ ప్రెసిడెంట్), మాల మధుబాబు (టీడీపీ మాజీ కౌన్సిలర్ – ఎమ్మిగనూరు), చేనేత మల్లికార్జున (టీడీపీ ఎమ్మిగనూరు సిటీ జనరల్ సెక్రటరీ) పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు.