Suryaa.co.in

Telangana

కొండా సురేఖ వ్యాఖ్యలపై లీగల్ చర్యలు

– కొండా సురేఖ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి
– బీ ఆర్ ఎస్ నేత డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

హైదరాబాద్: ప్రపంచ బ్యాంకుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యి మూసీ సుందరీకరణ అంటున్నారు.రేవంత్ రెడ్డి కుట్రకు పోలీసులు పావులు అవుతున్నారు. హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొతా రోహిత్కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నట్లు ట్వీట్ చేశారు.

మూసీ సుందరీకరణ పేరుతో లక్షా 50 వేల కోట్ల అవినీతిని బిఆర్ఎస్ అడ్డుకున్నది కాబట్టి బిఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తున్నారు.రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కొండా సురేఖతో అసంబద్దమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారు.

రేవంత్ రెడ్డి ధనదాహానికి హైడ్రా ఆయుధంలా మారింది.రేవంత్ రెడ్డి బండారం త్వరలో బట్టబయలు అవుతుంది. శ్రీలంకలో రాజపక్సే సోదరులపై ప్రజలు తిరుగుబాటు చేసినట్లు తెలంగాణలో రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు తప్పదు.

రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు వైపు ఉన్నారు.ప్రపంచ బ్యాంకు ఏజెంట్లు ఎన్ని దాడులు చేసినా మేము ఎదుర్కొంటాము కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదు. కొండా సురేఖ వ్యాఖ్యలపై లీగల్ గా ముందుకు వెళ్తాము. కొండా సురేఖ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. కొండా సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనం

LEAVE A RESPONSE