Suryaa.co.in

Andhra Pradesh

జగన్ దొంగతెలివితేటలు, భూ కుంభకోణాలకు అతిపెద్ద నిదర్శనం లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూదోపిడీ

– పరిశ్రమలు, ఉద్యోగాలని ఆశచూపి, రైతులనోట్లో మట్టికొట్టి, వారిపిల్లల జీవితాల్ని రోడ్డునపడేసి, అంతిమంగా నాలెడ్జ్ హబ్ భూముల్ని కొట్టేయడానికి ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నాడు
• అనంతపురం జిల్లాలోని బడుగు బలహీనవర్గాల రైతులకు చెందిన 8,864 ఎకరాల్ని తండ్రి అధికారంతో నాడు జగన్ ఇందూప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ సంస్థలకు కట్టబెట్టాడు
• వివిధవక్రమార్గాల్లో ఇప్పుడు వాటిని తనపరంచేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు
• రైతులనోట్లో మట్టికొట్టి, బ్యాంకులకు బురిడీవేసి, భూముల్ని కాజేయడానికి తన బంధువుల కంపెనీల్ని తెరపైకి తెచ్చాడు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

జగన్మోహన్ రెడ్డి ధనదాహం, స్వార్థానికి అనంతపురంజిల్లాలోని బలహీనవర్గాలైన రైతులకు చెందిన 8,864 ఎకరాల భూములు లేపాక్సి నాలెడ్జ్ హాబ్ పేరుతో బలైపోయాయని, భూములుకోల్పోయిన రైతులకు, ప్రభుత్వానికి ఉపయోగం లేకుండా జగన్ కు మాత్రమే న్యాయంజరిగిందని, కుంభకోణాలు ఎలాచేయాలో జగన్ కు తెలిసినంతగా ప్రపంచంలో మరెవరికీ తెలియదనడానికి ఈ భూదోపిడీనే నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలెడ్జ్ హబ్ పేరుతో ఎకరాకు రూ.60వేల నుంచి రూ.1.50లక్షల వరకు రైతులకు తూతూమంత్ర పరిహారమిచ్చి, కొట్టేసిన వేలకోట్లవిలువైన భూముల్ని స్వాహాచేసేందుకు జగన్ సిద్ధమయ్యాడు
“ లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్ని తాకట్టుపెట్టి ఒకసారి, అమ్ముకొని మరోసారి జగన్ విపరీతమైన లబ్ధిపొందాడు. జగన్ దొంగతెలివితేటలకు అనంతపురం జిల్లాలోని చిలమ త్తూరు,గోరంట్ల మండలాల్లోని బడుగుబలహీనవర్గాల వారిభూమి బలైపోయింది. రాజ శేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలెడ్జ్ హబ్ పేరుతో రైతులనుంచి తక్కువధ రకు భూముల్ని సేకరించారు. రైతులకు ఎకరాకు రూ.60వేలనుంచి రూ.1.50లక్షల వరకు తూతూమంత్రంగా పరిహారమిచ్చి, పరిశ్రమలువస్తాయి… పిల్లలకుఉద్యోగాలు వస్తాయని నమ్మించి వంచించారు. 8,864ఎకరాల భూముల్ని రాజశేఖర్ రెడ్డి ఇందూ ప్రాజెక్ట్స్ కి కట్టబెట్టారు.

ఆ భూముల్ని తాకట్టుపెట్టి, సదరుఇందూప్రాజెక్ట్స్ సంస్థ యాజమాన్యం, లేపాక్షి నాలెడ్జ్ హబ్ వారు రూ.4631కోట్ల రుణంపొందారు. ఒకప్రాజెక్ట్ పేరుతో ఉండేభూముల్ని చూపించి, మరోసంస్థతాకట్టుపెట్టి రుణంపొందడం ఇక్కడే జరిగింది. భూముల్ని తాకట్టుపెట్టి అప్పులుతీసుకున్న సంస్థ అక్కడ ఎలాంటి పనులు చేపట్టి, వాటిని అభివృద్ధిచేయకపోగా, జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు నిధులు మళ్లించి, క్విడ్ ప్రోకో కు పాల్పడింది.

లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములద్వారా అత్యధికలబ్ధిపొందిన వ్యక్తిగా నేటిరాష్ట్రముఖ్యమంత్రి జగన్ నిలిచాడు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా తండ్రిఅధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లవిలువైన భూకుంభకోణాలకు పాల్పడిన జగన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలనోట్లో మట్టికొట్టాడు. పేదలకు వేలరూపాయలిచ్చిన నాటిపెద్దలు, వేలకోట్ల విలువైనభూముల్ని కొట్టేశారు.

బ్యాంకుల నుంచి భూముల్ని కొట్టేయడానికి తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు డైరెక్టర్ గా ఉన్న ఎర్తిన్ అనే అనామకకంపెనీని జగన్ తెరపైకి తెచ్చాడు
భూముల్ని తాకట్టుపె ట్టిరుణాలు పొందినవారే, తిరిగివాటిని అక్రమమార్గంలో స్వాధీ నంచేసుకోవడానికి ఎర్తిన్ అనే అనామక కంపెనీని సృష్టించారు. రూ.5కోట్ల మూలధనం కూడాలేని కంపెనీకి రూ.500కోట్ల బ్యాంకురుణాలుచెల్లించి, వేలకోట్ల విలువైనభూముల్ని స్వాధీనంచేసుకునే అవకాశం కల్పించారు. అందుకు సంబంధించిన ఎన్.సీ.ఎల్.టీ కింద ఒకఒప్పందం చేసేప్రయత్నం చేశారు. ఎర్తిన్ కంపెనీ డైరెక్టర్ల జాబితాలో అందరూ జగన్మోహన్ రెడ్డి బంధువులే. జగన్ వేలువిడిచిన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కొడు కు నరేన్ రామాంజులరెడ్డి ఎర్తిన్ సంస్థలో డైరెక్టర్ గా చేరాకే, లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూ ముల్ని, సదరుసంస్థకు ధారాధత్తంచేసే ప్రయత్నాలకు సంబంధించిన ఫైళ్లు చకచకా ముందుకు కదిలాయి.

రూ.18వేలకోట్లనుంచి రూ.20వేల కోట్ల విలువైనభూముల్ని కేవ లం రూ.500 కోట్లకు ఒక అనామక కంపెనీకి ధారాధత్తం చేయడానికి అధికారయంత్రాం గం పరుగులుపెట్టిందంటే, దానివెనకాల ముఖ్యమంత్రి జగన్ హస్తం లేదని చెప్పగల మా? ముఖ్యమంత్రి అధికారబలంతోనే ఎర్తిన్ కంపెనీకి లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్ని కట్టబెట్టే కుట్రలుజరిగాయి.

జగన్ కుట్రల్ని పసిగట్టినతెలుగుదేశం పార్టీ రైతులపక్షాన పోరాడి, ఆ భూముల్ని తిరిగి రైతులకుఇవ్వాల్సిందేనని పోరాటంచేసింది. రైతులనోట్లో మట్టికొట్టి, వారినుంచి కారుచౌకగా కొట్టేసినభూముల్ని తాకట్టుపెట్టి వేలకోట్లరుణం పొంది, బ్యాంకుల్ని మోసగించిందికాక, తిరిగి అవేభూముల్ని బ్యాంకులనుంచి చౌకగా కొట్ట్టేసి, మరలావేలకోట్లకు బహిరంగమార్కెట్లో అమ్ముకోవాలని చూడటం ఎంతపెద్ద దోపిడీనో ప్రజలే ఆలోచించాలి. వైసీపీనాయకత్వం, జగన్ దోపిడీగ్యాంగ్ ఎంతనీచస్థితికి దిగజారారో ఈ వ్యవహారంతోనే అర్థమవుతోంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూదోపిడీపై ప్రజలు, మేథావులు, ప్రజాసంఘాలు తక్షణమే స్పందించాలి.

2013-14లో నాలెడ్జ్ హబ్ భూములద్వారా రూ.54కోట్ల ఆదాయం వచ్చినట్టు చెప్పిన లేపాక్షి సంస్థ, ఢిల్లీసంస్థకు చెల్లించాల్సిన రూ.5కోట్లు ఎందుకు చెల్లించలేదు?
ఈ భూములవ్యవహారంలో మరోతతంగం ఉంది. 2012 జనవరి 7న ఢిల్లీకి చెందిన గ్లోబ ల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియాసంస్థకు ఈ భూముల్లో 2,650ఎకరాలు కట్టబెట్టేలా లేపాక్షి నాలెడ్జ్ హబ్ సంస్థ ఒప్పందం చేసుకుంది. భూములకోసం ఢిల్లీసంస్థ అప్పట్లోనే లేపాక్షి హబ్ కు రూ.5కోట్లు చెల్లించింది. చెల్లించిన రూ.5కోట్లను తిరిగివ్వాలి..లేకపోతే 2,650ఎకరాలభూములైనా ఇవ్వాలని సదరుఢిల్లీ సంస్థ పట్టుబడుతోంది. 2013-14 ఆర్థికసంవత్సరంలో తమకు ఆ భూములద్వారా రూ.54కోట్ల ఆదాయం వచ్చిందని లే పాక్షి నాలెడ్జ్ హబ్ చెప్పిన నేపథ్యంలో, ఢిల్లీసంస్థకు చెల్లించాల్సిన రూ.5కోట్లు ఎందుకు చెల్లించలేదు?

రూ.5కోట్లతో పోయేదానికి 2,650ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నాలు ఎందు కు చేశారు? లేపాక్షి నాలెడ్జ్ హబ్ ముసుగులో జగన్ సాగించిన అక్రమ భూకుంభకోణం కుంభకోణాలకే పరాకాష్టగా నిలిచింది. జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి, అవినీతికి పేదలభూములు ఎలా బలైపోయాయో చెప్పడానికి పెద్దఉదాహరణ లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఉదంతం. విచ్చలవిడి కుంభకోణాలతో పేదల్ని దోచుకుంటున్న జే గ్యాంగ్ ముఠా ఆటకట్టించాల్సిన బాధ్యత రాష్ట్రప్రజలపైనే ఉంది.” అని శ్రీనివాసులు స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE