Suryaa.co.in

Telangana

జెండాలు వేరైనా ఒక్క అజెండాతో నిరుద్యోగుల కోసం కలిసి పోరాడదాం

– కాంగ్రెస్ ,బీజేపిలు కలిసి రావాలని అనుకుంటున్నాం
– అంగట్లో సరుకుల్లా ప్రశ్నా పత్రాలు అమ్ముకుంటున్నారు.
– టీఎస్పీఎస్సీ బోర్డు నియమించింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం కాదా?
– డ్రగ్స్ కేసుపై కూడా సిట్ వేశారు. విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి
– రాష్ట్రంలో 8వేల రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మాట నిజం కాదా?
-రైతులపాలిట కేసీఆర్ ఒక రాక్షసుడు. కేసీఆర్ ఒక ద్రోహి
అన్నిసబ్సిడి పథకాలు బంద్ పెట్టి ముష్టి 5వేలు ఇస్తే రైతులు కోటిశ్వరులు అవుతారా?
వైఎస్సార్‌టీపీ కాంగ్రెస్‌ అధినేత్రి వైయస్ షర్మిల

రాజకీయాలను పక్కన బెట్టి యువత కోసం ప్రతిపక్షాలు అన్నీ ఏకం కావాలని కోరుతున్నాం. ఆల్ పార్టీ యాక్షన్ కమిటీ ఫాం అవ్వాలి. మన జెండాలు వేరైనా ఒక్క అజెండాతో నిరుద్యోగుల కోసం కలిసి పోరాడదాం. T-SAVE.. తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీన్ అండ్ ఎంప్లాయిమెంట్ ఫోరం ఒకటి ఫాం చేద్దాం. ఇందులో అన్ని పొలిటికల్ పార్టీలు ఉంటాయి. కలిసి పోరాటం చేద్దాం. టీసేవ్ లో అన్ని ప్రతిపక్షాలు పాల్గొనాలని కోరుతున్నా.దీంట్లో ప్రతిపక్షాలకు అందరికీ సమాన హక్కులు ఉంటాయి.దీనికి ఎవరు నాయకత్వం వహించినా నాకు అభ్యంతరం లేదు.

నన్ను అడిగితే కోదండరామ్ అధ్యక్షుడుగా ఉండాలని కోరుకుంటున్న.కోదండరామ్ గతంలో ఎన్నో ఉద్యమాలను లీడ్ చేసిన వ్యక్తి. రాజకీయాలకు అతీతంగా ఇతర వ్యక్తులను ఎవరిని పెట్టినా పర్వాలేదు.అందరం కలసి ఒకరిని నాయకుడిగా ఎన్నుకుందాం. యువత కోసం మనం అందరం నిలబడాల్సిన అవసరం ఉంది.ఏప్రిల్ 10వ తేదీన సమావేశమై నిర్ణయం తీసుకుందాం.ప్రతిపక్ష పార్టీలను అన్నింటినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతిపక్షాలు అన్నీ కలిసి రావాలని కోరుతున్నాం.

అందరూ ఒక్క తాటిపైకి వచ్చి పోరాటం చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఒక్కటిగా పోరాటం చేస్తే అనుమతులు వస్తాయి . ప్రగతి భవన్ ముందు ధర్నా చేయడానికి కూడా అనుమతి వస్తుంది.ప్రగతి భవన్ లోపల కూడా ధర్నాకు అనుమతి వస్తుంది.సీబీఐ విచారణ కూడా జరుగుతుంది. కాంగ్రెస్ ,బీజేపిలు కలిసి రావాలని అనుకుంటున్నాం.కాంగ్రెస్ ఉంటే మీము రాము అని బండి సంజయ్ అంటున్నారు.బీజేపి ఉంటే మీము రాము అని రేవంత్ రెడ్డి అంటున్నారు.కాంగ్రెస్ ,బీఆర్ఎస్ రెండు ఒకటే అని బండి అంటున్నాడు.

రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. జాతీయ పార్టీ బీజేపిని కాళేశ్వరం మీద అవినీతి మీద ఎందుకు విచారణ చేయాలని డిమాండ్ చేయలేదు? కాళేశ్వరం విషయానికి వచ్చే సరికి సైలెంట్ గా ఎందుకు ఉన్నారు.లిక్కర్ స్కాం విషయంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపి అడగొచ్చు కదా? కాంగ్రెస్ ,బీఆర్ఎస్ కలిసి ఉన్నారని మీము ఆరోపణలు చేయొచ్చు. దయచేసి నిరుద్యోగుల విషయంలో రాజకీయాలు పక్కన పెడతాం. మనకు పార్టీలు ఉన్నాయి. కానీ నిరుద్యోగం విషయంలో ఒక్కటి అవుదాం.ప్రతిపక్షాలుగా ప్రజల పక్షాణ నిలబడకపోతే ఎందుకు ఉన్నట్లు? అందరం కలిసి పోరాటం చేద్దాం.చేతికి ఉన్న ఐదు వేళ్లు బిగిస్తే పిడికిలి.. పిడికిలి బిగిస్తేనే బలం.మనం పిడికిలి అవుదాం. నిరుద్యోగుల పక్షాన కొట్లాడుదం.

లక్షా 91 వేల ఉద్యోగాలే కాదు కొత్త జిల్లాలు మండలాలకు సరిపడా ఉద్యోగాలు కలుపుకొని భర్తీ చేయాలి.అంగట్లో సరుకుల్లా ప్రశ్నా పత్రాలు అమ్ముకుంటున్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు నియమించింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం కాదా? మరి బాధ్యత ఎవరిది? సిట్ వేశామని చెబుతున్నారు. డ్రగ్స్ కేసుపై కూడా సిట్ వేశారు. విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఒక్కరిని కూడా దోషిగా నిలబెట్టలేదు. నయీం ఒక క్రిమినల్ అని తెలిసి కూడా అందులోనూ ఏదీ బయటపెట్టలేదు. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో హోం మంత్రి మనవడు, మిత్రపక్షం ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని దాన్ని కూడా నీరుగార్చారు.ఇక సిట్ వేసి ప్రయోజనం ఏముంది?

రాష్ట్రంలో నిరుద్యోగం పెద్ద సమస్య. తెలంగాణలో 55 లక్షల మంది యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు. పాలకులు ఈ నిరుద్యోగ సమస్యను ముందే గుర్తించి ఉంటే నేడు ఇంత పెద్ద సమస్య అయ్యేది కాదు.ఇన్స్ టిట్యూట్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రిపోర్టు ప్రకారం తెలంగాణలో దేశంలో కంటే రెండు శాతం నిరుద్యోగం ఎక్కువగా ఉంది. కనీసం 55 లక్షల మంది నిరుద్యోగులుండగా ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరిగిపోతుందని ఆ సంస్థ తెలిపింది.

బిస్వాల్ కమిటీ ప్రకారం లక్షా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి, కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? 80 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయంటూ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్దాలు చెప్పారు.ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కూడా 33 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు.

అందులోనూ ఎనిమిది వేల ఉద్యోగాలకు మాత్రమే పరీక్షలు జరిగాయి.పరీక్షలు జరిగిన వాటిలో కూడా పేపర్ లీకులు, పరీక్షలు రద్దు.. వాయిదాలు. కేసీఆర్ సెకండ్ టర్మ్ లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కేసీఆర్ కు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉందని తెలిసే ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగ భృతి అని చెప్పారు. నిరుద్యోగులతో ఓట్లు వేయించుకున్నాక విస్మరించారు. కేసీఆర్ కొడుకు, బిడ్డకు పదవులు ఉండాలి, కనీస అర్హత లేని వాళ్లు మంత్రులు అవుతున్నారు. 6 నెళ్లలో ఉద్యోగాలు భర్తి చేస్తామని హరీష్ రావు చెప్పడం హస్యాస్పదం.5 ఏళ్లుగా భర్తిచేయక ఏం చేశారు. 80వేల ఉద్యోగాలు అని చెప్పి పాలాభిషేకాలు చేయించుకున్నారు.

రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 33వేల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇచ్చారు ఎలక్షన్ ఇయర్ లో భర్తి చేస్తామని చెప్తే నమ్మడానికి మీము పిచ్చోళ్లమా? 6 నెళ్లలో భర్తి చేస్తామని చెప్పడానికి సిగ్గు ఉండాలి.ఎకరానికి కోటి రూపాయలు సంపాదించే కేసీఆర్ ..తెలంగాణలో మిగతా రైతులు అంతే సంపాదించాలి కదా?

రైతుల ఆత్మహత్యలు లేవని పచ్చి అబద్దాలు చెప్తున్నాడు. కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నాడు. రాష్ట్రంలో 8వేల రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మాట నిజం కాదా రైతులపాలిట కేసీఆర్ ఒక రాక్షసుడు. కేసీఆర్ ఒక ద్రోహి. ఈయన కోటి రూపాయలు సంపాదిస్తే సరిపోతుందా?రైతులను అప్పుల పాలు చేశారు. బ్యాంకుల వద్ద మోసగాళ్లను చేశాడు. అన్నిసబ్సిడి పథకాలు బంద్ పెట్టి ముష్టి 5వేలు ఇస్తే రైతులు కోటిశ్వరులు అవుతారా?

LEAVE A RESPONSE