October 13, 2026

సరిహద్దులు చెరిపేద్దాం

గంగా, యమున, సింధు, గోదావరి,కృష్ణా,పెన్నా నదులన్నీ పాయలు,పాయలుగా చీలి
ఒకే చోట కి చేరినట్టు….
సంద్రమై ఉప్పొంగినట్టు…

జంతర్ మంతర్, ముంబాయ్
కోల్కత్తా, జార్ఖండ్, పంజాబ్
ఏ రాష్ట్రం చూసినా, ఏ చోటైనా జన్ జీ స్వరం జ్వాలలై ఎగిసెగసి
సరిహద్దులన్నీ చెరిపివేస్తే…..

56 ఇంఛీలఛాతి వణుకుతుంది
మోడీ మానియా,షా చాణిక్యo
పోలీస్ పహారలో పాలిస్తుంది.
ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు
ఓట్లు దొంగలకు మిలిటరీ కాపలా!

రాజ్యాంగ రక్షణకోసం రణం
రాజకీయం కాదు రణరంగం
నవభారత నిర్మాణం కోసం
యువలోకం సునామిలా ఎగేస్తే కార్పొరేట్ రాజ్యం కూలిపోదా?

నివురు గప్పిన నిప్పురాజుకుంటే
రాబందుల, రాజ్యాధి పతులు నిర్మిoచేబారికేడ్లు,బంది ఖానాలా
మనకడ్డంకి..నిర్భయంగా నీవు
ముoదుకెళితే నిన్నాపేదేవడురా!

ప్రెంచివాడిని ,డచ్చివాడిని,
బ్రిటీసోడిని తరిమి కొట్టినోళ్ళకి
మనువాదుల నెదిరించలేరా!.
కష్ట జీవులు ఒక్కటై తలపడితే,
ఏలినోళ్లని ఏటికి పంపించలేమా?

  • రెడ్డి శంకరరావు
    9494333511

Total Visitors: 3,072,804