– అది మిర్యాలగూడ నుంచే ప్రారంభిద్దాం
– దానికోసం యుద్ధం చేయాల్సిందే
– మీ వెనక నేనున్నా
– బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం
– బీజేపీలో ఎమ్మార్పీస్ నేతల చేరికల సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపు
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు సమక్షంలో మిర్యాలగూడకు చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు దైద రవి
పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర నేత, మిర్యాలగూడ పాలక్, సినీనటి కవిత, జిల్లా పార్టీ అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి, మదన్మోహన్. పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు ఏమన్నారంటే.. భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ స్వాగతం.
ఇంకొన్ని రోజుల్లో మరింత పెద్ద ఎత్తున నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే బిజెపిలో చేరాలి. బీజేపీ తోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. మిర్యాలగూడను బిజెపి కంచుకోటగా మార్చి, అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసేలా ప్రతి ఒక్కరు పనిచేయాలి.
మోదీ నాయకత్వంలో నల్లగొండ జిల్లాపై కాషాయ జెండా ఎగరేసేందుకు ప్రతి కార్యకర్త సుశిక్షితుడైన సైనికుడిలా పనిచేయాలి. మిర్యాలగూడ నుంచే బీజేపీ విజయ ప్రస్థానం ప్రారంభం కావాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కోటను బద్ధలు చేసి, బీజేపీ జెండా ఎగరేయాలంటే సుదీర్ఘ ప్రణాళిక, యుద్ధం అవసరం. దానికి సిద్ధంగా ఉండండి. మీ వెనుక నేనున్నా.