Suryaa.co.in

Telangana

బస్సుయాత్రతో జనం వద్దకు వెళదాం

– తెలంగాణలో మహిళా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు
– మహిళా నేతలు జిల్లాల్లో పర్యటించాలి
– తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం
-తెలుగు మహిళల శక్తి చాటండి
– తెలంగాణ తెలుగమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో మహిళా సమస్యల పరిష్కారం కోసం తెలుగుమహిళలు పోరాడాలని, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర తెలుగుమహిళలు జిల్లాల్లో పర్యటించి, మహిళా సమస్యలు గుర్తించాలన్నారు. బస్సుయాత్రతో ప్రజలకు చేరువయ్యే ప్రణాళిక రూపొందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడం, ప్రతి తెలుగుమహిళ బాధ్యత అని షకీలారెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని మహిళలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని షకీలా కోరారు.

తెలంగాణ రాష్ట్ర తెలుగుమహిళా విభాగం విస్తృత స్థాయి సమావేశం ఎన్టీఆర్ కార్యాలయము, హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమము అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి ఆధ్వర్యములో నిర్వహించారు. రాబోవు ఎన్నికలు మరియు బస్సు యాత్ర తో ప్రజల వద్దకు తెలుగు మహిళ ఏ విధంగా వెళ్ళాలో దిశా నిర్దేశం చేశారు. మహిళా కమిటీ సభ్యులు వివిధ జిల్లాల నుండి పాల్గొన్నారు.

ఉపాధ్యక్షులు ప్రమీల, పూతి కృష్ణవేణి రెడ్డి, ప్రధాన కార్యదర్శులు మాల్యావతి, నిర్మలా గౌడ్, దన్కడ్ రాధిక, కార్యాలయ కార్యదర్శి ఉప్పల శాంతి, అధికార ప్రతినిధి సంద్యపోగు సుజాత, కార్యాలయ కార్యదర్శులు శశిరేఖ, తగిరిశ లలిత, కార్యదర్శులు శీలం రత్నం, వద్దినేని సురేఖ, చిటికెల అశ్విని, కస్తూరి చౌదరీ, ఎం.స్వాతి చౌదరీ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE