Suryaa.co.in

Andhra Pradesh

బూమ్ బూమ్ షాపువద్దకు వెళ్దాం.. వస్తావా జగన్?

సవాల్ కు సిద్ధమా?
పొత్తుతో తాడేపల్లికొంపలో టీవీలు పగులుతున్నాయ్
ఒక చేత్తో పది ఇచ్చి మరో చేత్తో వంద లాగేస్తున్నాడు
విషం కంటే ప్రమాదం ఈ జగన్ మద్యం
ఎంపీగా పనికిరాని వ్యక్తి ఎమ్మెల్యేగా పనికివస్తాడా?
కళ్యాణదుర్గం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్

ఈ రోజు మంగళగిరి నుంచి నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు ఫోన్ చేశాడు. తాడేపల్లి చెతబుట్టలన్నింటిలో పగిలిపోయిన టీవీలు ఉన్నాయి.. ఏంటి కారణం అని అడిగాడు. నేను చెప్పా.. తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు ఎప్పుడైతే కుదిరిందో తాడేపల్లి కొంపలో టీవీలన్నీ పగలగొట్టాడు ఈ సైకో జగన్.

దళిత డాక్టర్ సుధాకర్ ను ఏవిధంగా వేధించి చంపారో మనం చూశాం. వాళ్ల హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలను కొట్టి జైలుకు పంపించిన మన జిమ్. నార్త్ కొరియాలో కిమ్ పెద్దపెద్ద భవనాలు కడతాడు. ఏపీలో సలహాదారులకు ప్రజాధనాన్ని లూటీ చేసి అప్పగిస్తాడు. ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా? ఈ జిమ్ సైకో జగన్. డిస్కవరీ యాప్ లో నార్త్ కొరియా డార్ట్ సీక్రెట్స్ కొడితే ఇవన్నీ బయటపడతాయి. ఇవన్నీ చూస్తే నాకు సైకో జగన్ గుర్తుకువచ్చాడు.

నేను జగన్ కొక సవాల్ విసురుతున్నా… టైం, డేట్ నువ్వు ఫిక్స్ చేయి.. బూమ్ బూమ్ షాపువద్దకు వెళ్దాం. సాక్షిని తీసుకురా. ప్రజలు మీ ప్రభుత్వం గురించి ఏమనుకుంటారో వింటే పారిపోతారు. మీరు సవాల్ కు సిద్ధమా? జగన్ రోజు ఏం తాగుతాడు? బూమ్ బూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం. నాలుగో ఆప్షన్ కరెక్ట్.

క్వార్టర్ పై జేట్యాక్స్ 25 రూపాయలు. నెలకు రూ.750, ఏడాదికి 9వేలు, ఐదేళ్లకు 45వేలు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు. ఒక చేత్తో పది ఇచ్చి మరో చేత్తో వంద లాగేస్తున్నాడు. అనకాపల్లిలో పాదయాత్ర సమయంలో ఓ తల్లి నా వద్దకు వచ్చి.. నాసిరకం మద్యం తాగి ముగ్గురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.

విషం కంటే ప్రమాదం ఈ మద్యం. టెస్టింగ్ కు పంపిస్తే.. పంట పొలాల్లో పురుగులు చనిపోయేంత దారుణంగా ఉంది. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాదుడే బాదుడు. ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి బాదుడే బాదుడు. ప్రజలు పడుతున్న కష్టాలు పాదయాత్రలో చూశాం. 3132 కి.మీ నడిచా. మీ కష్టాలు చూశాను, పవనన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్-6 హామీలు ఇచ్చారు.

టీడీపీ-జనసేన ఏర్పడిన ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తుంది మన ప్రభుత్వం. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతోంది.

జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా… బీసీలకు మీరు చేసిందేమిటి? 26వేలమంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టారు. 300 మంది బీసీలను చంపేశారు. బీసీలకు రావాల్సిన 75వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు. ఆదరణ పథకాన్ని రద్దు చేశారు. బీసీ సోదరులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాత రిజర్వేషన్లు తగ్గించారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా లక్షా 50వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఉపాధి కోసం ఐదేళ్లలో 10వేల కోట్లు ఖర్చుపెడతాం. ఆదరణ ద్వారా ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చుపెట్టి పనిముట్లు అందజేస్తాం.

కళ్యాణదుర్గం నియోజకవర్గం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐదేళ్లలో రూ.1200కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేశాం. హనుమంతరాయ చౌదరి నేతృత్వంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రైతులు ఆలోచించాలి. మీరు ఒక్క చిటికె వేస్తే ట్రాన్స్ ఫార్మర్లు వెతుక్కుంటూ వచ్చేవి. 700 ట్రాన్స్ ఫార్మర్లు తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది.

గత ఎన్నికల్లో తన్నే దున్నపోతు ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ వైకాపా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్.. ఏమైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా? పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారు. చెరువులను కబ్జా చేశారు. 250 ఎకరాల్లో రిసార్ట్ కట్టారు. తెల్ల కలర్ బంగ్లా కనిపిస్తోంది.. ఆ బంగ్లా ఆ తల్లిది. మీ డబ్బు పెట్టి ఎలాంటి ఇల్లు కట్టుకుందో చూడాలి. సెంటు స్థలాల పేరుతో అవినీతికి పాల్పడ్డారు. ఆమె కుటుంబ సభ్యులు కర్ణాటక మద్యం అమ్ముతున్నారు.

ఆ తల్లి ఇక్కడ చెత్త అని తేల్చి పెనుకొండ పంపించారు. మన ఇంట్లో చెత్త వేరే చోట బంగారం అవుతుందా? ఇక్కడో ఎంపీ ఉన్నారు, ఆయన మన జిల్లా పరువు తీసేశారు. తలారి రంగయ్య ఏనాడైనా రాష్ట్ర గురించి పార్లమెంటులో అడిగారా? కల్యాణదుర్గం ఓట్లు ఏవిధంగా అడుగుతారు? జగన్ ఇచ్చిన హామీలు అడగాలని నేను అడుగుతున్నా. ఎంపీగా పనికిరాని వ్యక్తి ఎమ్మెల్యేగా పనికివస్తాడా? ఇక్కడ ఎమ్మెల్యే వేరేచోట మంచివారు అవుతారా? ఇక్కడ మన కార్యకర్తలను పోలీసులు చితకబాదే సమయంలో రికార్డ్ చేసి ఎమ్మెల్యేకు పంపిస్తే.. ఆమె నవ్వుకునే వారంట? రెండు నెలలు ఓపిక పడితే వడ్డీతో సహా చెల్లిస్తాం.

టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపిస్తే టమోట రైతులను ఆదుకుంటాం. జీడిపల్లి-బీటీపీ ప్రాజెక్టు బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తిచేస్తాం. జీడిపల్లి కెనాల్ నుంచి 114 చెరువులకు మొదటి రెండేళ్లలో నీరు అందిస్తాం. టిడిపి-జనసేన-బిజెపి కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయదుందుభి మోగించాలి.

 

LEAVE A RESPONSE