Suryaa.co.in

Andhra Pradesh National

సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడి ప్రోత్సహిద్దాం

– దక్షిణ భారత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రుల సదస్సులో మంత్రి కందుల దుర్గేష్

బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం వంటి కీలక ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిని సారించి సమీక్ష నిర్వహించారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

సోమవారం కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ దక్షిణ భారత రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రుల సదస్సును బెంగళూరులో పెట్రోలియం మరియు సహజవాయువు,పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ సమక్షంలో ప్రారంభించారు. ఈ సదస్సుకు పర్యాటక మంత్రిత్వ శాఖ, దక్షిణ భారత రాష్ట్రాల నుండి పర్యాటక మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో వివిధ పర్యాటక సంబంధిత ప్రాజెక్టులపై దృష్టి సారించారు. దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద అన్ని కీలక ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ కార్యక్రమాలు పర్యాటక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం , సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యాటక సంబంధిత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి సారించడం జరిగిందన్నారు.

ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఫలితం పర్యాటక పరిశ్రమను గణనీయంగా ప్రభావితం చేస్తుందన్నారు. దేశీయ అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగ అభివృద్ధి , సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.

LEAVE A RESPONSE