* “సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్”కి స్ఫూర్తి శ్రీనివాస్ పిలుపు
* ఉత్సాహంగా ముందుకొచ్చిన చిన్నారులు
విజయవాడ: “అందమైన రూపంతో.. శ్రావ్యమైన స్వరంతో చిన్న.. చిన్న అడుగులతో మనసులు దోచే పిచ్చుకమ్మ మనల్ని వదిలి వెళ్లిపోయింది. ఆవాసం లేకనో.. ఆధారం లేకనో.. నూకలు లేకనో.. నేస్తాలు లేకనో.. కాలుష్యం వల్లనో.. రేడియేషన్ వల్లనో. ఎత్తైన భవంతులను.. ఇరుకైన మనుషుల మనసులను
వదిలి పచ్చని పైరు దగ్గరకు, స్వచ్ఛమైన గాలి దగ్గరకు ఎగిరిపోతుంది పిచ్చుకమ్మ”.. ప్రకృతికి మనం ప్రేమతో ఏదైనా చేస్తే దానికి పదింతలు మనకీ, మన ముందు తరాల వారికి మంచి జరుగుతుందనే నమ్మకాన్ని నేటి తరం చిన్నారులు, యువతకు కల్గిస్తూ అటు పర్యావరణ పరిరక్షణ, ఇటు పశుపక్షాధుల సంరక్షణకు నడుం బిగించారు విజయవాడకు చెందిన “స్పూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్.
అందులో భాగంగా ప్రకృతి పట్ల మనకున్న కనీస బాధ్యతను తెలియపరచి.. నేటి ఆధునిక, సాంకేతిక ప్రపంచంలో ప్రశ్నార్థకంగా మారిన చిరు ప్రాణి పిచ్చుకల మనుగడ పట్ల అవగాహన కల్పించి వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీసే బాధ్యతను తన భుజంపై వేసుకున్నారు “స్ఫూర్తి” శ్రీనివాస్.
ఈ సందర్భంగా “పిచ్చుకల” సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి ఆవశ్యకత తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో “స్పూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఉచితంగా ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కేజీ-పీజీ విద్యార్థులకు సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్
నిర్వహణ కోసం పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తూ పిచ్చుకల మనుగడ కోసం పరితపిస్తున్నారు. ఈ సందర్భంగా “స్ఫూర్తి” శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ కాంటెస్ట్‌లో పాల్గొనే విద్యార్థులు 11″ x 14″ (1/4) సైజ్ డ్రాయింగ్ షీట్‌పై పిచ్చుకల సంరక్షణ అనే అంశంపై చిత్రాలు గీయవలసి ఉంటుందన్నారు.
ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయుటకు మార్చి 10 ఆఖరి తేదీ అన్నారు. సేవ్ స్పారో వెబ్ పోర్టల్ http://savesparrow.recurr.co.in పూర్తి వివరాలతో చిత్రాన్ని అప్లోడ్ చేయటం savesparrowartcontest@gmail.comకి మెయిల్ చేయటం గానీ చేయాలి. ఒరిజినల్ చిత్రాలు మాకు పోస్/కొరియర్ ద్వారా చేరుటకు ఆఖరి తేదీ 15 మార్చి 2022. స్పూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ #60-22-4/13/2,శ్రీజ రెసిడెన్సీ, విక్రమ్ అపార్ట్‌మెంట్ ఎదురుగా, వాసిరెడ్డి శివరామకృష్ణయ్య వీధి, ల్యాండ్ మార్క్.. లలితా జ్యూవెలరీ, గాయిత్రీనగర్, విజయవాడ-520008, బహుమతి ప్రదానోత్సవం 20 మార్చి 2022 ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు “ప్రపంచ పిచ్చుకల దినోత్సవం” ఈ నెల 20న ఆదివారం సాయంత్రం సిదార్ధ ఆడిటోరియంలో ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, పతకాలు, జ్ఞాపికలతో పాటు బర్డ్ హౌస్‌లు అందజేస్తామని తెలిపారు.
మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ నందు గానీ, 9849355339/ 9390847433 (సాయంత్రం 5 నుండి 8 గంటల లోపు) ఈ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. “స్ఫూర్తి” శ్రీనివాస్ చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మనం కూడా భాగస్వాములు అవుదాం రండి..