Suryaa.co.in

Telangana

అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా ఉందాం

-ఊహించని ప్రకృతి విపత్తుని సమన్వయంతో ఎదుర్కొందాం
-ఎఫ్.సి.ఐ ఎఫ్ఏక్యూ నిబందనలు సవరించాలని మరోసారి కేంద్రాన్ని కోరుతున్నాం
-ఎవరూ నష్టపోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం
-రికార్డు స్థాయి పంట వచ్చినా ప్రక్రుతి వైపరీత్యాలతో ఇబ్బంది
-ఇబ్బందుల్లోనూ రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
-గతేడాది కంటే రెట్టింపుగా ధాన్యం కొనుగోళ్లు
-6087 కేంద్రాల ద్వారా 15.38 LMT’s సేకరణ
-సచివాలయంలో ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్లతో మంత్రి గంగుల సమీక్ష

అకాల వర్షాలతో రాష్ట్రంలో చేతికొచ్చిన పంట నష్టపోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే వారికి అందరం సహకరించాలని, ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం చేసే కృషికి బాధ్యత గల మిల్లర్లుగా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ సహకరించాలన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు సచివాలయంలో రాష్ట్ర మిల్లర్ల సంఘం ప్రతినిధులు, సివిల్ సప్లైస్ శాఖ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఖమ్మం, నిజామాబాద్ లలో ధాన్యం అన్లోడింగ్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది తన ద్రుష్టికి వచ్చిందని, ఎట్టిపరిస్థితుల్లోనూ కొనుగోలు కేంద్రం నుండి పంపిన ధాన్యాన్ని దింపుకోవాలన్నారు, ఆ రెండు జిల్లాలకు సంబందించిన సమస్యలపై చర్చించిన మంత్రి అప్పటికప్పుడే జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా యంత్రాంగాన్ని సమన్వయ పరుచుకుని సేకరణ వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించిన మంత్రికి ధన్యవాదాలు చెబుతూ తమ సమస్యలను మంత్రికి విన్నవించారు మిల్లర్లు. పదే పదే తడిచిన ధాన్యం మిల్లింగుకు పనికిరాకుండా పాడవుతుందని, నూక శాతం పెరగడంతో పాటు రంగుమారుతుందని, దీనిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆమోదించకపోవడంతో నష్టం జరుగుతుందన్నారు.

దీనికి మంత్రి గంగుల స్పందిస్తూ ఇప్పటికే కనీస నాణ్యతా ప్రమాణాలను సడలించాలని ఎప్.సి.ఐకు లేఖ రాసామని, మరోసారి దీనిని ఆమోదించవలసిందిగా కేంద్రానికి విజ్ణప్తి చేసారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దనే క్రుతనిశ్చయంతో ఉన్నారని, ఎవరూ నష్టపోకుండా అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ గెలిచి నిలిచిందని, ఎటికేడు రికార్డు స్థాయిలో ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నామని, ఐతే ఈ యాసంగిలో వరుసగా కురిస్తున్న అకాల వర్షాలతో అన్నధాతలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ క్లిష్ట సమయంలో పౌరసరఫరాల శాఖ సవాల్ గా తీసుకొని ధాన్యం సేకరణ చేస్తుందని, ఇందులో భాగస్వాములైన ప్రతీ ఒక్కరూ చిత్తశుద్దితో రైతులకు అండగా నిలవాలని సూచించారు మంత్రి గంగుల కమలాకర్.

ఇబ్బందికర పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం రైతుల నుండి ధాన్యాన్ని సేకరిస్తుందని, వర్షాలు కురుస్తున్నప్పటికీ రోజుకు సరాసరిగా లక్ష మెట్రిక్ టన్నులకు పైగా సేకరిస్తున్నామని, ఇవాల ఏకంగా 1లక్షా 61వేల మెట్రిక్ టన్నులు సేకరించి ఈరోజు వరకూ గతం కంటే రెట్టింపుగా ధాన్యాన్ని సేకరించామన్నారు. గత సంవత్సరం ఇదే రోజు 8 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా ఈరోజు వరకూ 15.38లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు. దీనిని 6087 కొనుగోలు కేంద్రాల్లో 1లక్షా 7వేల మంది రైతుల నుండి కొన్నామని దీని విలువ 3161 కోట్ల రూపాయలన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ సమీక్షలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ వి.అనిల్ కుమార్, రైస్ మిల్లర్ సంఘం అధ్యక్సులు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, ఇతర మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ కు జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
మంత్రి గంగుల కమలాకర్ తన జన్మధినం పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సచివాలయంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మంత్రిని అభినందించి, జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు.

మంత్రి గంగుల కమలాకర్ కు శుభాకాంక్షల వెల్లువ
నేడు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ జన్మధినం సందర్భంగా హైదరాబాద్లో పలువురు ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిషోర్ గౌడ్, సివిల్ సప్లైస్ కమిషనర్ వి. అనిల్ కుమార్, జీఎం రాజారెడ్డి, ఇతర అధికారులు, ఎంజేపీ సోసైటీ సెక్రటరీ మల్లయ్య భట్టు, బీసీ స్టడీసర్కిళ్స్ డైరెక్టర్ అలోక్ కుమార్, ఇతర బీసీ సంక్షేమ శాఖ అధికారులు. మంత్రి వ్యక్తిగత సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. అందరితో కలివిడిగా మాట్లాడిన మంత్రి గంగుల వారితో కలిసి మద్యాహ్న బోజనం చేసారు.

మంత్రి జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో సిబ్బంది రక్తదానం
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారి 55 జన్మదినోత్సవం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ వ్యక్తిగత సహాయకులు ఐత కిషన్ ప్రసాద్ ఆధ్వర్యంలో మీ సేవ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు, బీ ఆర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్ లు ముఖ్య అతిథిగా హాజరు కాగా కార్యాలయ సిబ్బంది తో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ రక్తాన్ని సేకరించగా సుమారు 20 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్ల ప్రధానం చేశారు. తమ అభిమాన నేత మంత్రి గంగుల కమలాకర్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మేచినేని వనజా దేవి – అశోక్ రావు, జీకే యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE