-మధిర పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
-మధిర పట్టణంలోని సుందరయ్య నగర్ మండల ప్రజా పరిషత్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు వేసిన భట్టి విక్రమార్క గారు
-పోలింగ్ కేంద్రం వద్ద మీడియాతో భట్టి
రాష్ట్రంలో ప్రభుత్వ మార్పుకి, ప్రజల ప్రభుత్వ ఏర్పాటు కావడానికి జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మార్పు కావాలని, ప్రజాస్వామ్యయుత సామాజిక నిర్మాణం జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేస్తున్నారు.రాష్ట్ర సంపద ప్రజలకు పంచాలని సక్రమంగా అన్ని వర్గాలకు అందాలని బలంగా కోరుకుంటున్నాను.పది సంవత్సరాల బడ్జెట్ వనరులు సంపద రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా దోపిడీకి గురైంది.
ధనిక రాష్ట్రాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అప్పుల తెలంగాణగా మార్చింది.కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు.కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. ఇంటి స్థలం, ఇండ్లు రాలేదు. భూములు రాలేదు, కొలువులు రాలేదు, ప్రజలకు ప్రయోజనం జరగలేదు.సంపద కొద్ది మంది చేతుల్లో గుత్తాధిపత్యంగా మారింది. దీనివల్ల ప్రజల మధ్యన వ్యత్యాసం పెరిగింది. దీని వల్ల సమాజంలో అశాంతి, అసంతృప్తి పెరిగిపోయింది.
బిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు ఓటును ఆయుధంగా మార్చుకొని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు.యువత కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నదే కొలువుల కోసం. కొలువులు భర్తీ చేయకుండా యువత జీవితాలతో చెలగాటమాడిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మీరు ఓట్లు వేయండి.బడుగు బలహీన వర్గాలు బాగుపడాలని తెచ్చుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం జరగడం లేదు. బడుగు బలహీన వర్గాలకు నిధులు కేటాయించని సర్కారు ను ఇంటికి సాగనంపుదాం.
వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందాలని తెలంగాణ తెచ్చుకున్నాం కానీ 10 సంవత్సరాలుగా మద్దతు ధర లేదు, పండించిన పంటపై బోనస్ లేదు, రాయితీలు లేవు, పంట నష్ట పరిహారం లేదు, వీటిని ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదాం.
ఉచితంగా మహిళలకు ఆర్టీసీ ప్రయాణం, ప్రతినెల వారి బ్యాంకు ఖాతాల్లో 2500 జమ చేస్తున్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి. నిరుద్యోగ యువత ఉన్నత చదువులు చదువుకోవడానికి అయిదు లక్షల క్రెడిట్ కార్డు, ఇండ్లు ఇంటి స్థలాలు ఆరోగ్యశ్రీ 10 లక్షలు పింఛన్ 4వేల రూపాయలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయల కట్నం తులం బంగారం లబ్ధి పొందాలంటే కాంగ్రెస్ ను గెలిపించుకోండి.