– క్షేత్ర స్థాయిలో పర్యటిస్తా
– అభివృద్ధిలో భాగస్వాములవుదాం
– పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
అమరావతి. పదవీ ప్రమాణం చేసిన తరువాత తొలిసారి సచివాలయం లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం తో పాటు శాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి సురేష్ కు పలువురు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు.
ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ….. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామన్నారు. విద్యాశాఖ మంత్రిగా దాదాపు సిఎం తో 80 సార్లు సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నానని ప్రతి విషయం క్షుణ్ణంగా సిఎం సమీక్షిస్తారన్నారు. సి ఎం ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి లో అందరం భాగస్వాములం అవుదామని, క్షేత్రస్థాయిలో తాను పర్యటిస్తానన్నారు. సి ఎం అజెండా నే తన అజెండా అని పెండింగ్ సమస్యలు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, సెక్రటరీ రామ్మోహన్, సి డి ఎం ఏ ప్రవీణ్, టిడ్కో ఎం డి శ్రీధర్, స్వచ్ఛ ఆంధ్ర ఎం డి సంపత్ కుమార్, సిఆర్ డి ఏ కమీషనర్ వివేక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.