– జిల్లా ఎస్పీ, డిఎస్పీ ల నుండి రక్షణ కల్పించాలి
– టీఆర్ఎస్ పార్టీ లో చేరనందుకే..రాజకీయ కక్ష
– సూర్యాపేట కి చెందిన బాధిత కుటుంబం హెచ్చార్సీ లో ఫిర్యాదు
సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన ఓ బాధిత కుటుంబం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.రాజకీయ కక్షలతో సూర్య పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తన భర్త ఎల్లయ్య ను అక్రమ కేసులు.. పిడి యాక్ట్ పెట్టి జైలు పాలు చేశారు.
జైలు నుండి విడుదలైన అనంతరం మంత్రి జగదీశ్వర్ రెడ్డి అండ తో వారి అనుచరులు మరో సారి హత్యాయత్నం చేశారు. సూర్యాపేట ఎస్పీ, డిఎస్పీ లు మంత్రి ఆదేశాల మేరకు హత్యాయత్నం జరిగినా పట్టిచుకోకుండా.. తన భర్త పై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు.
టీఆర్ఎస్ పార్టీ లో చేరనందుకే..రాజకీయ కక్షతో మంత్రి తమ కుటుంబాన్ని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బాధితులు హెచ్చార్సీకి వివరించారు. తమ కుటుంబానికి, తన భర్తకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆయన అనుచరుడు వట్టే జానయ్య, జిల్లా ఎస్పీ, డిఎస్పీ ల నుండి రక్షణ కల్పించాలని బాధిత కుటుంబం హెచ్చార్సీని వేడుకుంది.