Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ రాజధానికి లైన్ క్లియర్

-ప్రత్యేక నిధుల కేటాయింపు శుభపరిణామం
– బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి

తిరుపతి: వికసిత్ భారత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోదీ నాయకత్వంలో హ్యాట్రిక్ సాధించి 3.0 బడ్జెట్ ను వరుసగా ఏడవసారి ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఏపీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామం అన్నారు.

అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్ లో అదనంగా 15 వేల కోట్ల నిధుల కేటాయింపుతో ఏపీకి పూర్వ వైభవం ప్రారంభమై పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడతారన్నారు.

నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించి ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి అమరావతి రాజధానికి,పోలవరం ప్రాజెక్టు ను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక అదనపు నిధులు సైతం కేటాయిస్తామని ప్రకటించడం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనందుకు ఏపీకి మహర్దశ ప్రారంభమైంది.

రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు విశాఖ చెన్నై కారిడార్ కు ప్రత్యేక నిధుల కేటాయింపుతో రవాణా రంగం ఏపీలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు.

ఏపీ లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు రాష్ట్రంలో రైల్వే పోర్ట్ రోడ్ల హైవేల అభివృద్ధితో పారిశ్రామికంగా ఆర్థికాభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు.

చిరు వ్యాపారస్తుల కొరకు ఇదివరకు మంజూరు చేస్తున్న “ముద్రా” రుణాలను 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచడం సామాన్య మధ్యతరగతి వ్యాపారస్తులతో పాటు స్ట్రీట్ వెండర్స్ కు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరమన్నారు.

ప్రతి సంవత్సరం లక్షమంది విద్యార్థులకు 3 శాతంతో “విద్యా ఋణం” అందించడం అన్ని వర్గాల ప్రజలకు ఉన్నత చదువులు చదివే అవకాశం లభిస్తుందన్నారు.

భారతదేశంలో మొట్టమొదటిసారి కార్మికులందరికీ “డార్మెటరీ” తరహా అద్దె ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమన్నారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారీ పరిశ్రమలు ఏర్పాటై నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు.

500 పెద్ద కంపెనీలో కోటి మంది యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు స్వీకారం చుట్టడం నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భరోసా కలిగించే అంశం అన్నారు. నిరుపేదలు రైతులు మహిళల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపుతో పాటు ఏపీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని నరేంద్ర మోడీ కి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి ఏపీ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు.

LEAVE A RESPONSE