Suryaa.co.in

Andhra Pradesh

అనంత వరద భాదితులకు లయన్స్ క్లబ్ తోడ్పాటు

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనంతపురం నగరం శివారు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. మూడు రోజులుగా మోకాలు లోతు నీళ్ళల్లో ఇప్పటికీ కొన్ని కాలనీల ఇళ్ళు అందులో ప్రజలు ఉంటున్నారు. రుద్రంపేట, చంద్రబాబు కొట్టాలు, సిపిఐ నగర్, కక్కలపల్లి కాలనీ, జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముప్పై అడుగులు మోరి లేక పోవడంతో తొంభై కిలోమీటర్లు చుట్టి రావాల్సిన పరిస్థితి.

దగ్గరలో కక్కలపల్లి కాట్నే కాలువ మీదుగా వెళ్లే దారిలో పాల వ్యాను, లారీలు దిగబడి వాహనాలు నిలిచిపోయాయి. లయన్స్ క్లబ్ గుత్తి వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ యం. విరూపాక్ష రెడ్డి, అనంతపురం క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ సత్యనారాయణ, అధ్యక్షులు వైష్ణవ శ్రీనాథ్, ఉపాధ్యక్షులు లయన్image బాయినేని ప్రసాద్, గౌతమ్ బుద్ధ అభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు డా యం. సురేష్ బాబు, కోశాధికారి అనూష, మారుతీ ప్రసాద్ తదితరులు జలమయమైన కాలనీలను సందర్శించి నిత్యావసర సరుకులు అందించారు. సమాజంలో విపత్తు సంభవించినప్పుడు అది సహజమైనదా లేక ప్రకృతి వైపరీత్యమా అని సంకోచించక ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం లయన్స్ క్లబ్ గొప్పతనం అని లయన్ విరూపాక్ష రెడ్డి తెలిపారు.

ఎవరైతే లోతట్టు ప్రాంతాల వారికి సహాయం అందడం లేదు, వీరు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళడానికి ఇంట్లో వస్తువులను వదలి వెళ్లలేక పోతున్నారు, అలాగే తిండి లేక పస్తులుంటున్నారు, ఇలాంటి వారి కోసం వీరి క్షుద్బాధను తీర్చడానికి తాత్కాలిక ఉపశమనంగా సరుకులు అందించడం జరుగుతున్నదని డా యం. సురేష్ బాబు తెలిపారు. కొద్ది రోజులు టమోటా మండి దగ్గర టిఫిన్ ఏర్పాటు చేసినట్లు వి. సురేష్ కుమార్ తెలిపారు.image-2

LEAVE A RESPONSE