Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో పేలిన లిక్కర్‌ బాంబు

అదాన్ వెనుక విజయసాయిరెడ్డి, ఎస్పీవై వెనుక మిథున్ రెడ్డి
అదాన్ కంపెనీకి 1,160కోట్ల కేటాయింపు
1863కోట్ల రూపాయలు మద్యం ఈ డిస్లరీస్ నుంచి సేకరణ
చింతకాయల రాజేష్, పుట్టా మహేష్ కంపెనీల నుంచి కంపెనీలు లీజ్ కు తీసుకుని నడుపుతున్నారు
వీరిని బెదిరించి.. అదాన్ డిస్లరీస్ కంపెనీ సబ్ లీజ్
వారి నుంచి బలవంతంగా లాక్కుని బ్రాండ్ లను తయారు చేస్తున్నారు
ఎస్పీ వై ఛాంపియన్, గోల్డ్ పేరుతో అనేక మద్యం ప్రొడక్టు తయారు
ఎంయస్ బయెటెక్ సంస్థ తరపున అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి సబ్ లీజుకు తీసుకుని మద్యం సరఫరా
పాల్ డిస్లరీస్ కు 931.32కోట్ల రూపాయలు మద్యానికి ఆర్డర్
బి.ఆర్.కె స్పిరిట్స్ 1040 కోట్ల రూపాయల మద్యం సేకరణ
శర్వాణి బేవరేజెస్ ను చంద్రారెడ్డి నడుపుతుండగా 426.60 కోట్ల మద్యం ఆర్డర్
బిడి.యస్.హెచ్ ఆగ్రో కు 328 కోట్ల రూపాయలు మద్యం ఆర్డర్
16 కంపెనీల ద్వారానే 74 శాతం మద్యం సేకరణ
వంద కంపెనీలు ఉంటే.. 16 కంపెనీలకే ఎందుకు ప్రాధాన్యాత ఇస్తున్నారు?
కంపెనీల యాజమాన్యాల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు?
39 మంది మద్యం వల్లే ఆస్పత్రిలో ఉన్నారని తేలింది
56 వేల కోట్ల ఆదాయం మీకు వస్తుంటే.. 20వేల కోట్ల ఆదాయం ప్రభుత్వం చెబుతుంది
మరి లెక్కల్లోకి రాని ఆదాయం ఎక్కడకు వెళుతుందో జగన్ చెప్పాలి
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి

ఏపీలో ఇప్పటివరకూ గుట్టు చప్పుడు కాకుండా తయారవుతున్న ‘లిక్కర్‌ బాంబు’ ఒక్కసారిగా పేలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు-కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి.. హటాత్తుగా వైసీపీ నేతలు తయారుచేస్తున్న లిక్కర్‌ బాంబును పేల్చారు. లిక్కర్‌ తయారీ సంస్థలను బెదిరించి, ఎవరు.. ఏవిధంగా సబ్‌లీజులకు తీసుకుని సొంత బ్రాండ్లు తయారుచేస్తున్నారన్న రహస్యాన్ని, పురందేశ్వరి బద్దలు కొట్టి, వైసీపీ ‘మందు కోట’ రహస్యాన్ని జనం ముందు విప్పారు. ప్రధానంగా ఇందులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరో ఎంపి పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి హస్తం ఉందన్న మరో బాంబు పేల్చారు. ఎవరు ఏయే కంపెనీలను స్వాధీనం చేసుకుని, మందు బ్రాండ్లు తయారుచేస్తున్నారన్న చిట్టాను పురందీశ్వరి మీడియా సమక్షంలో బట్టబయలు చేశారు. పైగా.. విశాఖ కెజిహెచ్‌లో ఈ మద్యం తాగుతూ 39 మంది చికిత్స తీసుకుంటున్నారన్న మరో రహస్యాన్ని విప్పారు. తనపై శరపరంపరగా విమర్శలు సంధిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై.. పురందేశ్వరి అసలైన సమయంలో లిక్కర్‌ బాంబు పేల్చి, వైసీపీని ఆత్మరక్షణలో నెట్టారు.

విజయవాడ: ఏపీలో మద్యం తయారు చేసే డిస్లరీస్ యాజమాన్య వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేశాం. బీజేపీ పక్షాన్ ప్రభుత్వానికి సవాల్ చేసినా.. నేటి వరకు ఆ వివరాలును చెప్పలేక పోయారు.కంపెనీల వెనుక ఉన్న యాజమాన్యాల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పోరేషన్ లో వందకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి.వీటిలో 16 కంపెనీల ద్వారానే 74 శాతం మద్యం సేకరణ జరుగుతుంది.వంద కంపెనీలుు ఉంటే.. 16 కంపెనీలకే ఎందుకు ప్రాధాన్యాత ఇస్తున్నారు. 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు మద్యం పాలసీని మారుస్తున్నట్లు ప్రకటించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే మద్యం షాపుల నిర్వహణ మొదలు పెట్టారు.రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో నడుస్తున్నాయి.

అదాన్ డిస్టలరీస్ 2019 లో హైదరాబాద్ సాగర్ సొసైటీ ప్లాట్ నెంబర్ 16 నుంచి లో ప్రారంభించారు.ఈ అదాన్ కంపెనీకి 1,160కోట్ల కేటాయింపు జరిగింది. చింతకాయల రాజేష్, పుట్టా మహేష్ కంపెనీల నుంచి కంపెనీలు లీజ్ కు తీసుకుని నడుపుతున్నారు.వీరిని బెదిరించి.. అదాన్ డిస్లరీస్ కంపెనీ సబ్ లీజ్ కు తీసుకున్నారు.వారి నుంచి బలవంతంగా లాక్కుని బ్రాండ్ లను తయారు చేస్తున్నారు.

అదాన్ డిస్లరీస్ వెనుక విజయసాయిరెడ్డి ఉన్నట్లు మాకు సమాచారం ఉంది.1863కోట్ల రూపాయలు మద్యం ఈ డిస్లరీస్ నుంచి సేకరణ జరుగుతుంది.చంద్రబాబు అన్నింటికీ అనుమతి ఇచ్చారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.ఎస్పీవై వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మార్కెట్లోకి వచ్చింది. ఎస్పీ వై ఛాంపియన్, గోల్డ్ పేరుతో అనేక మద్యం ప్రొడక్టు తయారు చేస్తున్నారు.

అదాన్ వెనుక విజయసాయిరెడ్డి, ఎస్పీవై వెనుక మిథున్ రెడ్డి ఉన్నారు. అదాన్, ఎస్పీ వై సంస్థల అడ్రస్ రెండూ హైదరాబాద్ ఒకే చిరునామా. ఎంయస్ బయెటెక్ సంస్థ తరపున అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి సబ్ లీజుకు తీసుకుని మద్యం సరఫరా చేస్తున్నారు.మాన్షన్ హౌస్, మంజీరా క్లాసిక్, అథెంటిక్, రెరెస్ట్ స్పిరట్ బ్రాందీ తయారు చేస్తున్నారు.యన్.కె. డిస్లరీస్ తరపున 1966.66కోట్ల మద్యం సరఫరా చేశారు.

గతంలో ఎప్పుడూ వీళ్లు తయారు చేసిన కంపెనీల పేర్లే మార్కెట్ లో లేవని చెబుతున్నారు.ప్రకాశంజిల్లాలో పాల్ డిస్లరీస్ కు 931.32కోట్ల రూపాయలు మద్యానికి ఆర్డర్ ఇచ్చారు.సీఎం అనుచరులు బెదిరించి.. ఈ కంపెనీ లాక్కుని నడుపుతున్నారు.బి.ఆర్.కె స్పిరిట్స్ 1040 కోట్ల రూపాయల మద్యం సేకరణ జరిగింది.

శర్వాణి బేవరేజెస్ ను చంద్రారెడ్డి నడుపుతుండగా 426.60 కోట్ల మద్యం ఆర్డర్ ఇచ్చారు. బిడి.యస్.హెచ్ ఆగ్రో కు 328 కోట్ల రూపాయలు మద్యం ఆర్డర్ ఇచ్చారు. ఈ కంపెనీల పేర్లు, యజమానుల పేర్లు చెప్పాలని కోరినా ప్రభుత్వం స్పందించ లేదు.అందుకే మా బాధ్యతగా మద్యం తయారీదారులు, వారి వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు మేమే ప్రజలకు చెబుతున్నాం.

మద్యం తయారు చేసినా, విక్రయించినా.. కఠినంగా శిక్షిస్తామని జగన్ ఎన్నికల సమయంలో చెప్పారుమేము ఇప్పుడు మద్యం తయారీదారుల వివరాలు ప్రకటించాం. మరి ఇప్పుడు ఈ తయారీదారులను ఎప్పుడు అరెస్టు చేస్తారు?దశల వారీగా మద్యం నిషేధిస్తామన్న జగన్.. వారి అనుయాయులతో మద్యం తయారు చేసి పేదల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.

. కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు 39 మంది మద్యం వల్లే ఆస్పత్రిలో ఉన్నారని తేలింది.ఏపీలో అటువంటి పరిస్థితి లేదని వైసీపీ నాయకులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మరి వైద్యులు చెబుతున్న అంశాలపై ప్రభుత్వం స్పందించదా? 56 వేల కోట్ల ఆదాయం మీకు వస్తుంటే.. 20వేల కోట్ల ఆదాయం ప్రభుత్వం చెబుతుంది. మరి లెక్కల్లోకి రాని ఆదాయం ఎక్కడకు వెళుతుందో జగన్ చెప్పాలి. ఫైవ్ స్టార్ హోటల్స్ కే మద్యం పరిమితం చేస్తానని జగన్ చెప్పారు. కానీ అప్పు కోసం మద్య పాన నిషేధం ఉండదని, మార్పులు ఉండవని అగ్రిమెంట్ లో జగన్ సంతకం చేసింది వాస్తవం కాదా?వీటిపై అడిగితే కనీసం సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదు.

మద్యం షాపులో కేవలం నగదు ఇస్తేనే అమ్మకాలు చేస్తున్నారు వశిష్ట అనే కంపెనీకి ఏపీ ఆన్ లైన్ విధానంలో డబ్బులు కట్టించుకున్నట్లు చెప్పారు. కానీ అవేమీ పని చేయవు.. క్యాష్ అండ్ క్యారీ మాత్రమే అమలు చేస్తున్నారు. టీ, బజ్జీ కొట్టుకు వెళ్లినా నేడు ఫోన్ పే ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. బెల్టు షాపులకు అయితే హద్దే లేదు.. బడ్డీ కొట్లలో కూడా బహిరంగంగా అమ్ముతున్నారు.
ప్రభుత్వం స్పందించలేదు కాబట్టే.. మేమే మద్యం తయారీదారుల వివరాలు చెప్పాం.

ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాం: ఏపీ లో అప్పుల భారాలపై దగ్గుబాటి పురంధరేశ్వరి..
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ఎపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఫిర్యాదు చేశాం. పార్లమెంట్ లో చేసిన ప్రకటన ఆధారంగా ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందని వివరించాం. కార్పోరేషన్లు, రాష్ట్ర ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తెచ్చారు.ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాం. సీరియల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, ఐటీ, ఈడీ ద్వారా మద్యం కుంభకోణాలపై విచారణ చేపట్టాలని వినతి పత్రం ఇచ్చాం.

LEAVE A RESPONSE