– కల్తీ లిక్కర్ ప్రొడ్యూసర్స్ జోగి బ్రదర్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్!
– సీజన్ 1: చెవిరెడ్డి గారి ‘హెల్త్ హంగామా’ (జైలు నుండి ఎయిమ్స్ దాకా)
వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గారి జైలు జీవితం చూస్తుంటే, ఆయనో ఖైదీ కాదు, జైలు అధికారుల చేతే ‘వ్యాధుల వైవిధ్యం’ అనే కొత్త పరిశోధనా పత్రాన్ని సమర్పించే ప్రొఫెసర్ అనిపిస్తోంది. అరెస్ట్ అయిన రోజు జూన్ 18, 2025 నుండి నవంబర్ 24, 2025 వరకు ఆయన ఆరోగ్యం ఒక్క క్షణం కూడా స్థిరంగా లేదు! అసలు అరెస్ట్ అయిన రోజునే (జూన్ 18) తీవ్రమైన వెన్నునొప్పి అంటూ, కోర్టు అనుమతితో మంచం, దిండు, దోమతెర వంటి వీఐపీ ఖైదీ వసతులు పొందారు.
అంటే, జైలుకు రాకముందే డ్రామాకు అవసరమైన సెట్టింగ్ సిద్ధం చేసుకున్నారన్నమాట! ఆ మరుసటి రోజు నుంచే అసలు సిసలు ప్రదర్శన మొదలైంది.
ఎపిసోడ్ల వారీగా చెవిరెడ్డి గారి అనారోగ్య డ్రామాలు:
జూన్ 20: ది గుండె నొప్పి ఎంట్రీ: వెన్ను నొప్పి ఉపశమనం పొందక ముందే, రెండు రోజుల్లోనే తీవ్రమైన గుండె నొప్పి వచ్చిందని చెప్పి, నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి పరుగు. ఇది కేవలం భౌతిక నొప్పి కాదు, ‘నేను జైలులో ఉండలేను’ అని గుండె నుండి వచ్చిన రాజకీయ అభ్యర్థన.
జూలై – సెప్టెంబర్: వెన్నునొప్పి వీడని బంధం: ఈ కాలమంతా, ఆయన వెన్నునొప్పిని తగ్గించడానికి తిరుపతి స్విమ్స్ ఫిజియోథెరపీ కావాలని, లేదా జైలు మార్చాలని కోర్టులో పదేపదే పిటిషన్లు.
కోర్టు ఆ పిటిషన్లను తిరస్కరించినా, ఆయన మాత్రం డ్రామాను ఆపలేదు. ‘ఫిజియోథెరపీ’ని బెయిల్ పొందేందుకు ఒక కొత్త పాస్‌పోర్ట్‌లా ఉపయోగించాలని చూశారు.
నవంబర్ 3: ఎయిమ్స్ ప్రమోషన్: చివరకు, మామూలు ఆసుపత్రులు ఆయన ‘బహుళ ఆరోగ్య సమస్యల’కు సరిపోవని తెలిసి, ఏకంగా ఎయిమ్స్ మంగళగిరికి తరలింపు! ఆల్ గుడ్ అని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్టిఫికేట్ (మంచి డ్రామా ఆర్టిస్ట్ అని) ఇచ్చాక జైలుకు వెళ్లి గోడలను తన్నాడు.
నవంబర్ 20: మానసిక క్షోభ: తన ఆస్తులు అటాచ్ కావడంపై మానసిక ఆందోళన చెందానని కోర్టు ముందు ఒప్పుకున్నారు. అవును మరి, అసలు నొప్పి అంతా ఇక్కడే కదా!
నవంబర్ 23: వెరికోస్ వీయిన్స్ (న్యూ రిలీజ్): మొదట “అర్థరైటిస్ రుమటాలజీ” అని నటించారు. అది ఫ్లాప్ అవ్వగానే, వెంటనే వెరికోస్ వీయిన్స్ (కాళ్ళలో వాపు) అనే సరికొత్త రోగాన్ని పరిచయం చేశారు. ఎయిమ్స్ సీజన్ ఫినాలే! ఈ డ్రామా పీక్స్‌కి చేరడంతో, సూపరింటెండెంట్‌తో ఏకంగా ఎయిమ్స్‌కు రెఫెర్ చేయించుకున్నారు! వాళ్లు కూడా ఈయన సీరియల్ డ్రామాలు భరించలేక, ఎయిమ్స్ అయితే ప్రశాంతంగా జైలుకు వెళతాడని రెఫెర్ చేసినట్లున్నారు.
జోగి బ్రదర్స్: కల్తీ లిక్కర్ విత్ యూపీఐ ప్లాన్! ఒక పక్క లిక్కర్ స్కామర్స్ బెయిల్లు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటే, ఇంకొక వైకాపా టీమ్ – జోగి బ్రదర్స్ (మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము) – మరింత పెద్ద కుట్రకు తెగించారు. వీరు కల్తీ లిక్కర్ తయారీ యూనిట్‌ను పెట్టడం కేవలం వ్యాపారం కోసం కాదు. మీరు కూడా మాలా లిక్కర్ స్కామర్స్ అని నిరూపించడానికి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉద్దేశించిన ‘రాజకీయ కుట్ర’ ఇది! ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూడటం వీరి ఘనత! దొరికిన ఆధారాల ప్రకారం, జోగి రాము, ప్రధాన నిందితుడితో యూపీఐ లావాదేవీలు జరిపారు. జోగి రమేష్ గారు, జనార్దనరావుకి ఆఫ్రికాలో డిస్టిలరీ పెట్టేందుకు ఏకంగా రూ. 3 కోట్లు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ ఆఫ్రికా ప్లాన్‌లో భాగంగా, సెప్టెంబరు 23న ఉదయం 8.30 గంటలకు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి జనార్దనరావు వెళ్లి కలిశాడట. అంతేకాదు, వీళ్ళు ఒకే టవర్ లొకేషన్ పరిధిలో ఉన్నారట! దేశంలోనే వేలకోట్ల అతి పెద్ద తమ లిక్కర్ స్కాము, ఈరోజుల్లో సాధారణం అని ప్రచారం చెయ్యడానికి స్కెచ్ వేసి అడ్డంగా ఇరుక్కుపోయారు జోగి బ్రదర్స్.
లిక్కర్ స్కామర్స్ థియేటర్: జైలు సెట్లో నటులు, ఫ్లైట్ సెట్లో దర్శకుడు! జగన్, భారతితో నేరుగా సంబంధాలు వుండే వారి నుండి, పండగల సెట్టింగుల చెవిరెడ్డి బ్యాచ్ వరకు, హెల్త్ డ్రామాలు, బెయిల్, బెయిల్ రద్దు, కోర్టు హాజరు ఇలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కానీ, ఇరికించి కంటైనర్లకొద్దీ కరెన్సీ కట్టలను మింగేసిన జగన్ ఏమో హాయిగా పెళ్లిల్లకు, కోర్టు వాయిదాలకు ఫ్లైట్లల్లో రఫ్ఫా రఫ్ఫా యాత్రలు చేసుకొంటూ బిల్డప్ ఇస్తూ గడుపుతున్నాడు. ఈ ‘లిక్కర్ స్కామర్స్ థియేటర్’లో నటులు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు, దర్శక నిర్మాత మాత్రం హాయిగా ఫ్లైట్లలో షికార్లు కొడుతున్నాడు! లిక్కర్ స్కామర్స్ థియేటర్: జైలు సెట్లో చెవిరెడ్డి మెడికల్ డ్రామా, ఆఫ్రికా సెట్లో జోగి బ్రదర్స్ కల్తీ లిక్కర్ స్కెచ్, ఫ్లైట్ సెట్లో జగన్ రఫ్ఫా రఫ్ఫా యాత్రలు! ఇది సీరియల్ కాదు, వైకాపా రియల్ డ్రామా! – చాకిరేవు