– ఏటిజేడెలు పుస్తకావిష్కరణలో సజ్జల రామకృష్ణారెడ్డి
సాహిత్యం మంచి సమాజ నిర్మాణానికి దోహద పడుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తమకున్న సమయంలో కొంత సమయాన్ని పుస్తకాలు చదవడానికి ఉపయోగించాలని సూచించారు. సాహిత్యం తెలుగు భాష అభివృద్ధికి తోడ్పడడమే కాక సామాజిక విలువలను నేర్పిస్తుందన్నారు.
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రచయిత, జర్నలిస్ట్ బిజివేముల రమణారెడ్డి రాసిన ఏటిజేడలు పుస్తకాన్ని, మంగళవారం సాయంత్రం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఎమ్మేల్సీ రామసుబ్బా రెడ్డి లు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పుస్తక రచయిత బిజివేముల రమణారెడ్డిని అభినందించారు. సాహిత్య సేవలో ముందుకు సాగాలని కోరుకున్నారు. ఆ దిశగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాక్షించారు.