– ఇంటర్మీడియట్ చదువు కూడా తప్పనిసరి
– రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే ఈ నిబంధన
– విద్యార్థుల స్థానికతపై ఏపీ హైకోర్టు తీర్పు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌తో కలిపి వరుసగా నాలుగేళ్లపాటు విద్యాభ్యాసం చేసిన వారినే స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది.విద్యా, ఉద్యోగాల్లో స్థానికతను ఎలా గుర్తించాలనే అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.
ఆ ఉత్తర్వుల ప్రకారం, ఒక విద్యార్థి ఏపీలో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక హోదా పొందుతారని, ఈ నిబంధనలకు అనుగుణంగానే అధికారులు స్థానిక అభ్యర్థులను గుర్తించాలని ఆదేశించింది. గతంలో ఇదే అంశంపై ఉమ్మడి హైకోర్టు ఫుల్‌బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది.
స్థానికత నిబంధనలను సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లలో ఎలాంటి పసలేదని పేర్కొంటూ వాటిని కొట్టివేసింది.