విజయవాడ: పశ్చిమ నియోజకవర్గం, 40 వ డివిజన్ కి చెందిన పొందుగల కోటేశ్వరి హెర్నియా సమస్య తో బాధ పడుతోంది.. ఆమెకు సర్జరీ కోసం 1,51,500/-. రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆమె ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించింది.. ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు సహాయం చేయాలంటూ ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం ఆర్ ఎఫ్ కు లేఖ రాశారు..
అదే విధంగా 47 వ డివిజన్ కు చెందిన షేక్ మీరాజ్ వల్లీ విద్యుత్ షాక్ తో ప్రమాదానికి గురై కోమా లోకి వెళ్ళాడు.. దీంతో వైద్యులు అతనికి వెంటిలేటర్ సపోర్ట్ తో వైద్యం అందించేందుకు 9,00,000/-.రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. అతని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన ఆర్థిక సాయ. కోసం సీఎం సహాయనిధి కి లేఖ రాశారు.. వీటికి సంబంధించిన ఎల్వోసీ లను బాధితుల కుటుంబ సభ్యులకు అంద చేశారు.
వారు ఎమ్మెల్యే సుజనా చౌదరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, 40డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పునుగుపాటి సుబ్బయ్య , 43,45 క్లస్టర్ ఇంచార్జ్ సుబ్బారెడ్డి , పార్టీ నాయకులు సందాని ,పిచ్చయ్య,
-50వ డివిజన్ బిజెపి అధ్యక్షులు పోలవరపు దుర్గారావు , ఊర్మిళ నగర్ బిజెపి మండల అధ్యక్షుడు పగడాల కృష్ణ, మన్నం నారాయణ , సుజనా మిత్ర కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.