– ఇంటర్మీడియట్ విద్యార్థులు
అమరావతి: మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదివిన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు విచ్చేసి వారిని నాన్ లోకల్ గా పరిగణిస్తున్నారని ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకొని వెళ్లాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూఖ్ షిబ్లీని ఇంటర్మీడియట్ విద్యార్థులు కలిసి అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి 10సంవత్సరాలు గడిచిన తరువాత ఈ ఎకడమిక్ సంవత్సరం నందు మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు తెలంగాణలో విద్యను అభ్యసించిన తన సొంత రాష్ట్రంలో నాన్ లోకల్ గా పరిగణించబడటం వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ మరియు ర్యాంకుల పరంగా వారి కోట తగ్గిపోవడం వల్ల వారికి న్యాయబద్ధంగా రావలసిన అవకాశాలు రావటం లేదు దీనివల్ల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ఇలాంటివారు రాష్ట్రంలో దాదాపు 7వేల మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం.
కాబట్టి మంత్రి నారా లోకేష్ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని వీరి సమస్యను త్వరితగతంగా పరిష్కరించాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి విద్యార్థులు అభ్యర్థించారు.