– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి కంకణం కట్టుకున్నారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు. ప్రజలు అధికారం ఇచ్చింది..కబ్జాలు, దోపీడీలు, అడ్డుపడినవారిని చంపడానికి లైసెన్సు అన్నట్టు దారుణాలకు తెగబడుతున్నారు.
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారిపల్లికి చెందిన గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్యవహారాలలో ఏర్పడిన వివాదంతో వైసీపీ నేత ఎన్. వెంకట్రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంపడం రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ అరాచకాలకి పరాకాష్ట.
జగన్రెడ్డి దిశ వాహనాలకి జెండా ఊపి ప్రారంభించి మహిళల భద్రతకి నాది భరోసా అని మాయమాటలు చెప్పి మూడురోజులు కాలేదు. వైసీపీకి చెందిన వెంకట్రమణారెడ్డి మహిళని అత్యంత పాశవికంగా కొట్టి చంపేశాడు. ఇదేనా ముఖ్యమంత్రి మహిళలకు మీరిచ్చే భద్రత? అండగా నిలవాల్సిన ప్రభుత్వమే అంతమొందిస్తుంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తుంటే..రాష్ట్రప్రజల ప్రాణాలకి దేవుడే దిక్కు.