Suryaa.co.in

Andhra Pradesh

వృద్ధుల్ని చంపుతామ‌ని బెదిరించ‌డం వైసీపీ క‌బ్జాకోరుల అరాచ‌కాల‌కి ప‌రాకాష్ట‌

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

వివాదంలో ఉన్న త‌మ కుటుంబ ఆస్తిని క‌బ్జాచేసిన‌ పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి బినామీ అటికెలగుండు బాబిరెడ్డి, త‌మ‌ను చంపుతామంటూ బెదిరిస్తున్నార‌ని మురళీమోహన్‌గౌడ్‌- జయదేవి దంప‌తులు కర్నూలు కలెక్టరేట్‌ వద్దనున్న గాంధీ విగ్రహం దగ్గర నిరసనకి దిగ‌డం వైసీపీ భూక‌బ్జాల దందా రాష్ట్రంలో ఏ రేంజులో సాగుతోందో స్ప‌ష్టం చేస్తోంది.

పత్తికొండలోని సర్వే నంబరు 115, 116, 117లో 8.25 ఎకరాల భూవివాదం కోర్టులో వుండ‌గా వైసీపీ ఎమ్మెల్యే బినామీ బాబిరెడ్డి త‌న‌పేరుతో భూమి రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌డం ఓ త‌ప్ప‌యితే, అందులో నిర్మాణాల‌కి దౌర్జ‌న్యంగా దిగ‌డం

దారుణం. నిల‌దీసిన వృద్ధుల్ని చంపుతామ‌ని బెదిరించ‌డం వైసీపీ క‌బ్జాకోరుల అరాచ‌కాల‌కి ప‌రాకాష్ట‌. వృద్ధుల‌కి పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పించాలి. కోర్టు వివాదంలో వున్న భూమిని క‌బ్జాచేసిన బాబిరెడ్డిపై కేసు నమోదు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాను.

LEAVE A RESPONSE