– మంత్రి లోకేష్
అమరావతి : ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ‘మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే మా లక్ష్యం. అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి రూ.15,000 ఇస్తాం.అందులో సందేహం లేదు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకూ ఈ పథకం వర్తిస్తుంది’ అని శాసనమండలి లో వెల్లడించారు.