Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ చేస్తున్నది మిడ్ నైట్ యాత్ర

– తెలుగుబూతుల పార్టీగా టీడీపీ మారింది
– బూతుల సభకు రూ. 20 కోట్లా..?
– బూతులే భవిష్యత్తుకు మీరిచ్చే భరోసానా..?
– లోకేశ్‌ శుంఠన్నర కాబట్టే.. బాబు సినిమాస్టార్ వైపు చూస్తున్నాడు
– గుడివాడలో పోటీచేసి గెలిచే దమ్ముందా..?.. లోకేష్ కు సవాల్
– నానిని చూస్తే.. బాబు ప్యాంట్‌ ఎందుకు తడిసిపోతుంది..?
– టీడీపీలో ఉన్నప్పుడూ వంశీ పశువుల డాక్టరే కదా..!
-ః మాజీమంత్రి  పేర్ని నాని

మిడ్ నైట్ యాత్ర
మాజీ ముఖ్యమంత్రి, నలభై ఏళ్ల పొటిటికల్‌ ఇండస్ట్రీ చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్‌- యువగళం పేరిట యువగంగాళం యాత్ర చే స్తున్నాడు. సూర్యుడు అస్తమించే సమయానికి పాదయాత్ర ప్రారంభిస్తాడు. అర్ధరాత్రి నడిచేదానికి యువగళం అని నామకరణం చేసుకున్నాడు. అసలు, నీ వయసెంత..? నువ్వు నడిచే పాదయాత్ర తీరేంటి..? సాయంత్రం 6 గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజామున 3 గంటలకు ముగించేదాన్ని పాదయాత్ర అంటారా..? మిడ్ నైట్ యాత్ర అంటారా..? పగటిపూట పాదయాత్ర చేస్తే .. నువ్వూ నీ డాడీ నిర్వాకం ఏంటని ప్రజలు నిలదీస్తారని .. ఆనాటి మీ పాలనను ఛీ కొడతారనే భయంతోనే రాత్రి తిరుగుతున్నాడేమో.. ఏదిఏమైనా, ఈ లోకేశం యాత్ర పుణ్యమాని అక్కడక్కడ పేదోళ్లకు రోజుకి రూ. వెయ్యి గిట్టుబాటవుతుంది.

బూతుల సభకు రూ. 20 కోట్లా..?
కృష్ణాజిల్లాలో యాత్ర పేరుతో బెజవాడలో నాలుగైదు వీధులు తిరిగాడు. కన్నుమూసి తెరవగానే గన్నవరం చేరుకున్నాడు. అక్కడ ఒక రూ.పదో ఇరవై కోట్లో ఖర్చు పెట్టి కుర్చీలేసి బహిరంగ సభ పెట్టాడు. ఆ సభ ఎందుకయ్యా అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల్ని బూతులు తిట్టడానికంట. బాబు సంస్కారహీనంగా పెంచి బజారులో తోలితే సంస్కారం లేని వ్యక్తిగా తయారయ్యాడు ఈ లోకేశం.

సంస్కారం లేని వ్యక్తులతో, అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడే వారితో టీడీపీ నిండిపోయింది. తెలుగుదేశంపార్టీ కాస్తా తెలుగు బూతుల పార్టీగా మారింది. ప్రజల సమస్యలు వినరు. వాటిని అవగతం చేసుకోరు. అయితే, ఈరోజు చంద్రబాబు, లోకేశ్‌ తీరును అందరూ చూస్తున్నారు. నలుగురు చంచాగిరి గాళ్లను పక్కనబెట్టుకుని నానారకాల దుర్భాషలాడటం.. అసభ్యకర బూతులు తిట్టడం, వ్యక్తిగత దూషణలు చేయడం .. ఇలాంటి వారి ప్రవర్తనను ప్రజలు చీదరించుకుంటున్నారు.

టీడీపీ నేతలు, ఆపార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశం మాట్లాడుతున్న ట్రెండింగ్‌ అబద్ధమేమంటే.. భవిష్యత్తుకు భరోసా ఇస్తారంట. వారు మాట్లాడే బూతులే భవిష్యత్తుకు భరోసా అంటున్నారు. నిన్నటిదాకా మా నాన్న చాలా అబద్ధాలు చెప్పాడు. నేను మా నాన్నలా కాకుండా అంతకుమించి అబద్ధాలు ఆడతానంటూ.. టీడీపీ మ్యానిఫెస్టోలోని అబద్ధాల్ని పదేపదే వివరిస్తున్నాడు.

మాటకొస్తే టీడీపీలో ప్రతోడూ వల్లభనేని వంశీని పట్టుకుని పశువుల డాక్టర్‌ అంటాడు. ఆయనేమన్నా వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరి జగన్‌ కాలేజీలో పశువుల డాక్టర్‌ కోర్సు చేసి బయటకొచ్చారా..? ఈరోజు కొత్తగా ఆయనేమీ పశువుల డాక్టర్‌ కాలేదే..? 2014, 2019లో టీడీపీ తరఫున గన్నవరం ఎమ్మెల్యేగా, 2009లో విజయవాడ ఎంపీగా పోటీచేసినప్పుడు వంశీ పశువుల డాక్టరే.. మరి, ఆ పశువుల డాక్టర్‌కే ఓటేయమ్మని టీడీపీ నేతలు ఆరోజు అడుక్కున్నారు. ఆ పశువుల డాక్టర్‌కే ఆరోజు విజయవాడ టీడీపీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. మరి, ఆయన అప్పుడేమో మనుషుల డాక్టర్‌.. ఇప్పుడేమో పశువుల డాక్టరయ్యాడా..? వంశీని అలా మాట్లాడటానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలి.

గుడివాడలో కొడాలి నాని ని పట్టుకుని లోకేశ్‌ పెద్దపెద్ద మాటలు మాట్లాడాడు. ఈ బాబుకొడుకులకు నేనొక ఛాలెంజ్‌ చేస్తున్నాను. మీకు ఆవగింజంత సిగ్గు.. దోసగింజంత ఆత్మాభిమానం ఉంటే 2019 నుంచి ఇప్పటిదాకా గుడివాడలో టీడీపీ క్యాండెట్‌ ఎవరో చెప్పండి. ఎన్టీఆర్‌ మనవడ్ని అని చెప్పుకుంటున్న లోకేశ్‌ను సవాల్‌ చేస్తున్నాను. దమ్మూధైర్యముంటే గుడివాడలో పోటీచేసి నాని గారిపై గెలవమనండి. చివరికి గన్నవరంలో కూడా పార్టీ ఇన్‌ఛార్జి లేకపోతే.. వైఎస్‌ఆర్‌సీపీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఓడిన వ్యక్తిని తీసుకెళ్లి గన్నవరం ఇంచార్జిగా పెట్టుకున్న దౌర్భాగ్య పరిస్థితి టీడీపీది.

లోకేశ్‌కు నేను బహిరంగ సవాల్‌ విసురుతున్నాను. నువ్వు ఉన్నచోటికి నేనొస్తాను. బందరు పోర్టుకు ఈ లోకేశ్‌ భూసేకరణ చేయలేదు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే బందరు పోర్టు పనులపై చిత్తశుద్ధిగా జగన్‌ గారి ప్రభుత్వం పనిచేస్తుంటే.. ఈ టీడీపీ రాక్షస మూకలు యాగాన్ని భంగం చేసేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 5 దావాలేసి సెప్టెంబర్‌ 2022 వరకు ఎంత కాల్చుకుతిన్నారో ప్రభుత్వానికి, మా బందరు ప్రజలకు తెలుసు.

LEAVE A RESPONSE