-మానసిక వైకల్యం ఉన్నవారు ఏ పదవికి, ఉద్యోగానికి అర్హులు కారు
-లోకేష్ కు మానసిక వైకల్యం అని సజ్జల అంటే… కాదు, జగన్మోహన్ రెడ్డి కే మానసిక వైకల్యం అని మందులు కూడా వాడుతున్నాడన్నారన్న లోకేష్
-పోలవరం పనుల ప్రగతిని బట్టి నిధులను విడుదల చేయాలి
-19వేల కోట్లు కాకపోతే 30 వేల కోట్ల రూపాయలు ఇవ్వండి… కానీ కేంద్రం ఒకేసారి నిధులు ఇచ్చి చేతులు దులుపుకోవద్దు
-పోలవరం ఎత్తు 45.5 మీటర్ల ఎత్తుకు వెళ్తుందా?లేదా? చెప్పకుండా, 41. 15 మీటర్ల ఎత్తే ఫైనల్ అన్నట్టుగా చెప్పడం విడ్డూరం
-పోలవరం తొలివిడత పూర్తి అయిన తర్వాత రెండవ విడత పనులు చేపట్టాలి
-ప్రధాన ప్రతిపక్ష నేతను కలవడం తప్పేమీ కాదు… గోదావరి జిల్లాల ఎంపీగా అది నా బాధ్యత
-రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర హోం శాఖ మంత్రి ని ముఖ్యమంత్రే కాదు… ప్రధాన ప్రతిపక్ష నేత కలవవచ్చు… కలిస్తే తప్పేముంది?
-హవ్వ… దళిత మహిళను ట్రాక్టర్ తో గుద్ది చంపి వేస్తారా?, ఇదెక్కడి అన్యాయం
-ఉద్యోగ సంఘాల నాయకుడు సూర్యనారాయణ పై ప్రభుత్వ దాష్టీకం సరికాదు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
మనోవైకల్యం ఉన్నవారు ఏ పదవికి, ఏ ఉద్యోగానికి అర్హులు కారు. ఇది చట్టంలోనే ఉంది.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లలో మానసిక వైకల్యం ఎవరికి ఉన్నదనే తేలాలి. నారా లోకేష్ కు పుట్టుకతోనే మానసిక వైకల్యం ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించగా, తనకు కాదు… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే మానసిక వైకల్యం ఉందని, లండన్ మందులు కూడా వాడుతున్నారని నారా లోకేష్ అన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి లో మానసిక వైకల్యం ఎవరికీ ఉన్నదో తెలియాలంటే, ఇద్దరూ రక్త పరీక్షలకు సిద్ధం కావాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మానసిక వైకల్యానికి జగన్మోహన్ రెడ్డి లండన్ మందులు తినేది నిజం కాకపోతే, నారా లోకేష్ బహిరంగంగా సవాల్ చేసే అవకాశం లేదు ?, ఆయన మాట్లాడేది నిజమైతే… ఇంకొంచెం ధైర్యంగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి మానసిక వైకల్యానికి మందులు తింటున్నారన్న నిజాన్ని నేనైతే నమ్మడం లేదు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా,ఆయన మేనమామ నియోజకవర్గంలో తొడ కొట్టి నారా లోకేష్ సవాల్ చేశారంటే, ప్రజలు అపోహ పడే ప్రమాదం ఉంది. నారా లోకేష్ సవాల్ చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రక్త పరీక్షలకు సిద్ధం కావాలి. ఈ సందర్భంగా నారా లోకేష్ ధైర్య, సాహసాలను అభినందించాల్సిందే.
సినిమా కథానాయకుడు బాలకృష్ణ రీల్ లైఫ్ లో డైలాగ్ చెప్పగా, రియల్ లైఫ్ లో నారా లోకేష్ ప్రాక్టికల్ గా చూపించారు. నారా లోకేష్ ధైర్య సాహసాలను అభినందిస్తున్నాను. ఈ వయసు ఈ తరహా ధైర్యసాహసాలను ప్రదర్శించిన నారా లోకేష్ ను, ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయన మేనమామ నియోజకవర్గం కమలాపురంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
45.5 మీటర్ల ఎత్తుకు వెళ్తున్నామా? 41. 15 ఫైనల్ అన్నట్లు చెప్పడం విడ్డూరం
పోలవరం ప్రాజెక్ట్ 45.5 మీటర్లకు వెళ్తున్నామా?, 41. 15 మీటర్లే ఫైనల్ అన్నట్లుగా చెప్పడం విడ్డూరంగా ఉంది. 41.15 మీటర్లు తొలి దశ పూర్తి అయిన తర్వాత, రెండవ దశ ప్రాజెక్టు పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని రఘు రామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును బహుళర్ధ సాధక ప్రాజెక్టుగా, పెద్ద డ్యాం గా నిర్మించాల్సిందే, ఒక బ్యారేజీ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజధాని అన్నది రాష్ట్ర ప్రజలకు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి మూడు రాజధానులు అని పేర్కొంటున్నారు. అమరావతి నా?,విశాఖపట్నం అన్నది రాష్ట్ర రాజధానిగా చెప్పుకోలేని దుస్థితి.
పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని రాష్ట్ర మంత్రి రోజా చెబుతున్నారు. పారిశ్రామికవేత్తలను క్యూ కడుకున్నారు అంటే , రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పడికేసినట్టే. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా వచ్చింది లేదు. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు ఎందుకు క్యూ కడుతారు. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారనే బూటకం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును జూన్ 2025 నాటికి పూర్తి చేస్తారా?, లేకపోతే 20 24 నాటికి పూర్తి చేయకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తారా??అని అపహాస్యం చేశారు.
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి ఉదాసీన వైఖరితో, బండ్ కుంగిపోతున్న మాజీ ముఖ్యమంత్రిని, గత కాంట్రాక్టర్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 41.15 మీటర్లను పూర్తి చేయడానికి దాదాపు 12 వేల కోట్ల రూపాయలు కావాలని, అలాగే రిపేర్ల కోసం రెండు వేల కోట్ల రూపాయలు జగన్ అండ్ కంపెనీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బండ్ కుంగిపోతే జగన్మోహన్ రెడ్డి 1000 మంది పోలీసుల సంరక్షణలో పోలవరం ప్రాజెక్టును సందర్శించడం విడ్డూరంగా ఉంది.
ప్రజా జీవితంలో ఉన్న ప్రజా నాయకుడు పోలీసుల సంరక్షణలో వెళ్లడం ఏమిటి?. ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎవరిని దగ్గరకు రానివ్వకపోగా, భయపడేలా వ్యవహరిస్తున్నారు. పాత కాంట్రాక్టర్ ని, మాజీ ముఖ్యమంత్రిని తిట్టి పబ్బం గడుపుకోవడం అన్నది ముఖ్యమంత్రికి అలవాటుగా మారింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తే రిహాబిలిటేషన్ తోసహా 17 వేల నుంచి 18 కోట్ల రూపాయలు కలిపి ఇస్తామని కేంద్రం అంగీకరించింది. అయితే పోలవరం ప్రాజెక్టు ప్రగతి పనులను పరిశీలించిన తర్వాతే నిధులను విడుదల చేయాలి.
పోలవరం ప్రాజెక్టు నిధులను విడుదల చేసి కేంద్రం చేతులను దులుపు కోరాదు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రికి, సంబంధిత శాఖ కార్యదర్శి కలిసి వివరిస్తాను. ప్రధాన ప్రతిపక్ష నేతను ఉపయోగ గోదావరి జిల్లాల ఎంపీగా కలవడం అనేది నా బాధ్యత. ప్రతిపక్ష నేతను కలవడం తప్పేమీ కాదు. తన తమ్ముడి బెయిల్ కోసమే, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే ముఖ్యమంత్రి కి, ఎప్పుడూ తన తమ్ముడికి బెయిల్ వచ్చింది కాబట్టి రాష్ట్ర విభజన హామీలు, పోలవరం గుర్తుకు వస్తుందో లేదో నని ఎద్దేవా చేశారు.
మా పార్టీ నేతలను క్షమించమని తలైవాను కోరారు
ఎన్టీఆర్ ఆశయాలను కొనసా గిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తూ మాట్లాడిన సూపర్ స్టార్ రజినీకాంత్ ని మా పార్టీకి చెందిన కొందరు విమర్శించడం పట్ల నేను ఆయనకు క్షమాపణలు తెలిపారు. మా పార్టీ నాయకత్వం నుంచి స్క్రిప్ట్ వస్తుందని, ఆ స్క్రిప్ట్ మీడియా ముందు చదవకపోతే పార్టీ నేతలను కొడతారు. దెబ్బలు తినే దాని కంటే… తిట్లు తిట్టడమే బెటర్ అని మా పార్టీలోని కొంతమంది నాయకులు మిమ్మల్ని తిట్టారు. వారిని మీ మనస్సు క్షమించాలని నేను కోరాను.
పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా, పార్టీ తరఫున ఆయనను క్షమాపణలు కోరే హక్కు నాకు ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే , నేను క్షమాపణలు కోరి ఉండే వాన్ని కాదు. రజినీకాంత్ ను లాంటి అద్భుతమైన వ్యక్తితో , అరగంట సమయం గడిపే అవకాశం నాకు లభించడం అదృష్టమని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
అవినాష్ రెడ్డి పారిపోలేదా?
ఉద్యోగుల సంఘాల నాయకుడు సూర్యనారాయణ పై చార్జ్ మెమో జారీ చేసి, దాన్ని క్రిమినల్ కేసుగా మార్చడం దారుణం. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న వైయస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ లభించక ముందు పారిపోలేదా? సూర్యనారాయణ పారిపోయినట్టుగా పేర్కొనడం, వృద్ధురాలైన ఆయన తల్లిని వేధించడం సిగ్గుచేటు.
కొండపి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ బాల వీరాంజనేయులు స్వామి అనుచరుడి భార్య, అంగన్వాడీ టీచర్ అయిన దళిత మహిళలను ట్రాక్టర్ తో గుద్దించి చంపడం మా ప్రభుత్వ దాష్టికానికి పరాకాష్ట. గతంలో ఎంతో మంది దళితుల్ని ఇదే తరహాలో చంపి పార్శిల్ చేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు.