అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ లండన్ లోని ఇస్కాన్ టెంపుల్ లో విశేష పూజలు చేశారు. మోదీకి దీర్ఘాయుష్షు ప్రసాధించాలని భగవంతుడిని వేడుకున్నా.. దేశానికి దిశానిర్ధేశం చేసే దూరదృష్టి నాయకత్వం కోసం ఆశీర్వాదాలు కోరుకున్నా… మోదీ మార్గదర్శకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకం ఉందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.
