Suryaa.co.in

Andhra Pradesh

నేనంటే వాళ్లకి భయం

– నేనంటే భయంకాబట్టే వైసీపీసభ్యులు, మంత్రులు నన్నుతిడుతూ, ప్రజల్లో హీరోలు అవుదామనుకుంటున్నారు
– ప్రజలకోసమే పనికిమాలినవాళ్ల తిట్లనుభరిస్తున్నా
– అధికారమదంతో నోరుపారేసుకునే వాళ్లెవరినీ వదిలిపెట్టను
– నారా లోకేశ్

శాసనసభలో నేనులేకపోయినా, అక్కడుండే వైసీపీసభ్యులకు నన్నుతిట్టనిదే పూట గడ వడంలేదు. అలానే మండలిలోకూడా నాజపంచేయందే వారికినిద్రపట్టడంలేదు. నేనంటే వారికి భయమని నాకుఅర్థమవుతోంది. సభలోనా, బయటా వారితప్పులను ఎత్తిచూపుతూ, ఆధారాలతోసహాప్రజల్లో వారిని దోషులుగా నిలబెడుతున్నాను కాబట్టే..నాపైవారికి చెప్పలేనంత అక్కసు, అసూయద్వేషం ఉన్నాయి.
అందుకే అయినదానికీ, కానిదానికీ నన్నే తిడుతూ, ప్రజల్లోహీరోలు అవుదామనుకుంటున్నారు.

ప్రజలకోసమే అడ్డమైనవారు ఎన్నితిట్లుతిట్టినా భరిస్తున్నాను. నేను తాగుబోతునని దుర్భాషలాడినా, సహించాను. నాపై చేసిన అనేకఅసంబద్ధమైన, నిరాధారఆరోపణలపై ఇదివరకే నిరూపించాలని సవాల్ చే శాను…కానీఅధికారపార్టీవారు ఎవరూస్పందించలేదు. నన్ను ముండా అనితిట్టినా ఊరుకున్నాను. నేనుపెద్దవాళ్లను గౌరవించే వ్యక్తిగా ఏనాడూఎవరినీ ఏమీఅనలేదు.

ఆఖరికి తనవయస్సునికూడా మర్చిపోయి, డిప్యూటీ సీఎంగాఉన్నవ్యక్తి హద్దులుమీరి మాట్లాడిన నేను సంయమనంకోల్పోలేదు. హుందాగా, గౌరవంగానే వ్యవహరించాను. తనతప్పు తెలుసుకొని డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పలేదు. పేపర్ లో క్లియర్ గా ఆయన అన్నది రిపోర్టు అయింది. అసెంబ్లీలోకూడా రికార్డైంది. సరే తరువాత వారుదాన్నిఎలాగూ తీసేస్తారు..అదివేరే విషయం.

అసెంబ్లీలో ఉన్నవారంతా టెన్త్ ఫెయిల్ బ్యాచ్. అది మా దౌర్భాగ్యం. వాస్తవాలు బయటపడుతున్నాయనే వైసీపీవారికి నాటుసారా, కల్తీమద్యం అంటే భయం. నేనుఆధారాలతో సహా ప్రజలముందు వారిని దోషులుగా నిలబెడుతుంటే, నన్ను తిట్టి సమస్యలను పక్కదారిపట్టిస్తున్నారు. నాటుసారా మరణాలపై చర్చించకుండా, తప్పించుకోవడానికే పెగాసెస్అంశాన్నిసభలో చర్చకుతెచ్చారు. పెగాసస్ విషయంలో ప్రభుత్వం వద్దఆధారాలుంటే హౌస్ కమిటీవేసుకోవచ్చని ఎప్పుడోచెప్పాను. ఊరికే దాన్ని పట్టుకొని అసెంబ్లీలోబయటపడదామనిచూస్తున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని చూస్తుంటే కుక్కతోకపట్టుకొని గోదావరి ఈదినవైనంగానే ఉంది.

పెగాసస్ అంశంపై చర్చ కేవలంసభా సమయాన్ని వృథాచేయడమే. నన్ను తిడుతుంటే శాసనసభలో స్పీకర్ తెగ ఆనందపడిపోతున్నారు. సీఎం విరగబడి నవ్వుతున్నారు. ఆనాడు నా తల్లిని దూషించినప్పుడు కూడా సీఎం, స్పీకర్ రాక్షసుల్లా వికృతంగా నవ్వారు. అవేవీమర్చిపోను… నేను గుర్తుంచుకుంటాను. టెన్త్ ఫెయిల్ బ్యాచ్ శాసనసభలో ఉన్నారు.. అలాంటివారు చెబుతుంటే వినడం ప్రజలఖర్మ.

మంత్రులు అసలు టెన్త్ కూడా చదవలేదు. సభానియమాల ప్రకారం స్పీకర్, ఛైర్మన్ లు అమలు చేయాల్సిన నిబందనలు అమలు చేయరు.ఎథిక్స్ కమిటీకిఇప్పటికే పాతికపైగా లేఖలురాశాను. ఏమీ జరగలేదు. నేనే స్వయంగా ఒకఎస్పీవైఖరిని తెలియచేస్తూ లేఖరాసినా ఇంతవరకు స్పందనలేదు. టీడీపీసభ్యులు సభకు అడ్డుపడుతున్నారంటూ మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు తప్ప, సభానియమాలు.. నిబంధనలు అనేవి స్పీకర్ కు, ఛైర్మన్ కు పట్టుబట్టడంలేదు.

తానుసాగిస్తున్న అక్రమమద్యం వ్యాపారం ప్రజలకు తెలియకూడదనే జగన్మోహన్ రెడ్డి సభలో నాటుసారా మరణాలపై స్పందించకుండా తప్పించుకుంటున్నాడు : పరుచూరి అశోక్ బాబు
జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై ఏదో మొక్కుబడిగా సీఎం అసెంబ్లీలో సమాధానం చెప్పారుగానీ కౌన్సిల్ కు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి ఆ సభలో చెప్పినదానికి, ఇక్కడచెప్పేదానికి సంబంధంలేదన్నారు. అందుకని మేమంతా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మద్యపాననిషేధం హామీపై చర్చించాలనికోరుతూ వాయిదాతీర్మానం ఇస్తే, యథాతథంగా దాన్ని తిరస్కరించారు. మేం సభలోకి వెళ్లేటప్పుడే వైసీపీవారు నిన్నజరిగిందే ఈరోజు జరుగుతుందంటూ వెకిలిగా మాట్లాడారు.

నాటుసారామరణాలపై ముఖ్యమంత్రి సమాధానంచెప్పేవరకు తమపోరాటం ఆగదని మావైఖరిని చాలాస్పష్టంగా తేల్చిచెప్పాం. ముఖ్యమంత్రి సమాధానం మేంకోరుతుంటే, మంత్రి సమాధానంచెబితే చాలంటున్నారు. అసెంబ్లీకంటే మండలికి ఉండే గౌరవం.. గొప్పతనమే ఎక్కువ. సీఎంకు అసెంబ్లీనే సభ.. కౌన్సిల్ సభే కాదన్నభావన బాగాఉంది. ముఖ్యమంత్రి వైఖరిని తాము సహించేదిలేదు. సభఎన్నిరోజులున్నా మా ఉద్యమం ఆపేదిలేదని ఇప్పటికే చెప్పాము.

చాలామంది ప్రజాసంఘాలనేతలు, మేథావులు, రాజకీయనేతలు టీడీపీవారు ఒకే అంశాన్నిఎందుకు పట్టుకున్నారంటున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమీలేని అనేకఅంశాలను రోజులతరబడి ప్రచారంచేస్తూ, సభలను, ప్రజలను తప్పుదారి పట్టించిన సందర్భాలు కోకోల్లలు. అలాఅని మేంఇప్పుడు ఆయన బాటలో నడుస్తున్నామని అనుకోవద్దు. కల్తీసారా మరణాలపై తమవద్దఉన్న ఆధారాలను ప్రభుత్వానికి సమర్పించాకకూడా ముఖ్యమంత్రి ఘటనపై ఎందుకు న్యాయవిచారణకు ఆదేశించలేకపోయారు?

నాటుసారాతయారీ, మరణాలు అనేవి జంగారెడ్డిగూడెం ప్రాంతానికే పరిమితంకాలేదు. రాష్ట్రవ్యాప్తంగాఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి పులివెందులలో కూడా నాటుసారా అమ్మకాలు జరుగుతుంటే ముఖ్యమంత్రిఆధ్వర్యలోని ఎస్ ఈబీ(స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో) విభాగమే దాడులుచేసి, పలువురిని అరెస్ట్ చేయడంజరిగింది. సభాసమావేశాలు ప్రారంభమయ్యాకే ఎస్ఈబీ కొన్నివేల కేసులు నమోదుచేసింది. ఆవిషయం ముఖ్యమంత్రికి తెలియదా? అన్నీతెలిసే ఈ లిక్కర్ డాన్ సీఎం నటిస్తున్నాడు. రాష్ట్రంలో సారావ్యాపారమే లేదన్నట్లుగా ముఖ్యమంత్రి తననటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నాడు.

చంద్రబాబు హయాంలోనే కల్తీమద్యంబ్రాండ్లు వచ్చాయంటున్న ముఖ్యమంత్రి… వాటిని ఇప్పుడు తానెందుకు మార్కెటింగ్ చేస్తున్నాడోచెప్పాలి. ప్రభుత్వం అమ్ముతున్న జేబ్రాండ్ మద్యంలో అన్ పర్మిటెడ్ కెమికల్స్ ఉండటంవల్లే ప్రజలప్రాణాలపై ప్రభావం పడుతోంది. ఈప్రభుత్వం అమ్ముతున్న లిక్కర్ తాగితే రెండు, మూడేళ్లకే అవయవాలు దెబ్బతింటున్నాయి. బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా ఎవరో ఒకసభ్యుడు అడిగాడని ప్రభుత్వం మండలిలో పెగాసస్ పై చర్చచేపట్టింది.

సారాతాగి చనిపోయినవారిపై చర్చ అనవసరం అంటున్న ప్రభుత్వవ్యాఖ్యలు, ముఖ్యమంత్రి విచక్షణా రాహిత్యానికి నిదర్శనం. ప్రజలకోసం నేడు ఆఖరికి మేం పోడియం ఎక్కాము. కొందరు వైసీపీసభ్యులు సభామర్యాద అంటే ఏమిటోకూడా తెలియకుండా వెల్ లోకివచ్చి మాకుపోటీగా నినాదాలు చేశారు. అధికారంలోఉన్నారో.. ప్రతిపక్షంలోఉన్నారో కూడా తెలియని స్థితిలో వైసీపీసభ్యుల ప్రవర్తన ఉంది. గతంలో మంత్రులే మూడురాజధానుల బిల్లుపై చర్చజరిగే సమయంలో ఛైర్మన్ పోడియంపైకి ఎక్కి నానారభసచేశారు.

వారిలా మేము ఏనాడూ ఛైర్మన్ ను దూషించడం… ఆయనకుర్చీని లాగడం… ఆయనపైకి కాగితాలువిసరడం లాంటివి చేయలేదు. నాటుసారా మరణాలు… ముఖ్యమంత్రి సాగిస్తున్న కల్తీమద్యం అమ్మకాలు ఆయనదోచుకుంటున్న ప్రజలసొమ్ముగురించి ప్రజలకు తెలియచేసే తీరుతాం. జంగారెడ్డిగూడెంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రోజూ ప్రజలప్రాణాలుపోతున్నాకూడా ముఖ్యమంత్రికి అసలు చలనమేలేదు. ప్రజలప్రాణాలంటే జగన్ రెడ్డికి చులనకనభావం. ఎల్జీపాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు హుటాహుటిన విశాఖకు వెళ్లి, మృతులకుటుంబాలకు కోటిరూపాయలచొప్పున పరిహారంప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నాటుసారా తాగి చనిపోయినవారి విషయంలో ఎందుకింత నిర్దయగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నాడని ప్రశ్నిస్తున్నాం.

ఈనెల 29న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవసభలో ఈ ముఖ్యమంత్రి దుర్మార్గపు వైఖరిని ఎండగడతాం. జంగారెడ్డిగూడెం సంఘటనపై భారీఎత్తున నిరసన తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి అనధికారికంగా సాగిస్తున్న మద్యంవ్యాపారం తాలూకా మూలాలను ప్రజలముందుఉంచుతామని స్పష్టంచేస్తున్నాం. చీప్ లిక్కర్, కల్తీసారా, ఎన్ డీపీ లిక్కర్ అమ్మకాలతోపాటు, మద్యనిషేధంపాలసీపై ముఖ్యమంత్రి సమాధానంచెప్పేవరకు వదిలిపెట్టము.

మద్యంఅమ్మకాలపై వచ్చేఆదాయమే జగన్ ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆక్సిజన్ : దువ్వారపు రామారావు
జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి 26 మంది చనిపోతే ప్రభుత్వ స్పందన శూన్యం. ఏడు రోజుల నుండి టీడీపీసభ్యులందరం మృతులకుటుంబాలకు న్యాయంచేయాలని పోరాడుతున్నా ప్రభుత్వంలో చలనంలేదు. టీడీపీసభ్యులకు సమాధానంచెప్పలేకనే ముఖ్యమంత్రి సభకు ముఖంచాటేస్తున్నాడు. అప్రజాస్వామికంగా నేడు సభనుంచి 6గురు టీడీపీసభ్యులను బయటకు పంపించారు. దశలవారీగా మద్యపాననిషేదం అమలుచేస్తానని చెప్పి, ఎన్నికలకుముందు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాటతప్పి, మడమతిప్పారు.

గత కౌన్సిల్ సమావేశాల్లో మూడురాజధానులబిల్లు అంశం చర్చకు వచ్చినప్పుడు, వైసీపీసభ్యులు, మరీముఖ్యంగా మంత్రులు కోతులకంటే దారుణంగా ప్రవర్తించారు. ఆరోజు వారు చేసింది ప్రజలుప్రత్యక్షంగా చూసిఉంటే ఆరోజే వారిముఖాన ఉమ్మేసేవారు. మరీదారుణంగా ఛైర్మన్ స్థానంలోఉన్న షరీఫ్ గారిని అవమానకరంగా కులంపేరుతో దూషించారు. మద్యపాననిషేధం అనిచెప్పిన ముఖ్యమంత్రి, నేడు మద్యపానాన్నే తనప్రభుత్వానికి ఆక్సిజన్ లా మార్చుకున్నాడు.

అది లేకుంటే ఈ ప్రభుత్వం నడవదు. మద్యపాననిషేధం అనిచెప్పిన మీరే, మద్యంఅమ్మకాలపై వచ్చేఆదాయాన్ని మార్ట్ గేజ్ చేయించి రూ.40వేలకోట్లవరకు అప్పులుతేవడానికి ఈముఖ్యమంత్రి ప్రయత్నిస్తు న్నాడు. కౌన్సిల్ సమావేశాల్లో వాస్తవాలుచెప్పకుండా మమ్మల్ని ఈప్రభుత్వం అడ్డుకోగలదే మోకానీ, ప్రజలమధ్యకువెళ్లి వారికి అర్థమయ్యేలాచెప్పకుండా మమ్మల్ని ఆపలేరు.

మిగిలిన రెండ్రోజుల్లో అయినా ముఖ్యమంత్రి తాములేవనెత్తే అంశాలపై సభకువచ్చి సమాధానంచెప్పగలడా?… ఆయనకు అంతధైర్యం ఉందా? :  దీపక్ రెడ్డి
జంగారెడ్డిగూడెం సంఘటనపై కనీసం ఈ రెండు రోజుల్లోనైనా కేవలం అర్ధగంట చర్చించే దమ్ము, ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి లేకుండాపోయాయి. ప్రజల తరపున ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై చర్చించాలనే ధ్యాస ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేదు. ముఖ్యమంత్రి తొలుత సారా మరణాలు కాదు….సహజ మరణాలన్నాడు. అది అబద్ధమనిచెబుతూ తాము అనేక అధారాలను ప్రభుత్వంముందు ఉంచితే, వాటిపై సభలో చర్చించడానికి ముఖ్యమంత్రికి ధైర్యం రావడం లేదు.

నాటుసారా మరణాలు బయటపడ్డాక, ప్రభుత్వం అమ్ముతున్న నాసిరకం మద్యంఅమ్మకాలు, వాటితయారీ అమ్మకం వంటి వివరాల్లోకివెళితే, కల్తీమద్యం ముసుగులో ముఖ్యమంత్రి సాగిస్తున్న మద్యంవ్యాపారం తాలూకా గుట్టుమట్లు బయటపడ్డాయి. తనక్రిమినల్ బ్రెయిన్ లోని ఆలోచనలతో ఈ ముఖ్యమంత్రి ప్రజలసొమ్ముని దండుకుంటూ ప్రభుత్వఖజానాకే బొక్కపెడుతున్నాడు. నాటుసారా, కల్తీమద్యంపై ఉభయసభల్లో చర్చజరిగితే తనదోపిడీ బయటపడుతుందన్న భయం జగన్మోహన్ రెడ్డికి పట్టుకుంది.

అందుకే ఆయనమాకు ముఖంచాటేస్తూ, తనకుతాను అసెంబ్లీలో డబ్బాలుకొట్టుకుంటూ చంద్రబాబుగారిపై, టీడీపీపై బురదజల్లుతున్నాడు. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి నిజంగా దమ్ము, ధైర్యంఉంటే, ఆయన నిజంగా ప్రజలఓట్లతోనే ముఖ్యమంత్రి అయితే మిగిలిన రెండ్రోజుల్లో అయినా టీడీపీసభ్యులు సభలో లేవనెత్తే అంశాలపై చర్చకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్షసభ్యులు గౌరవసభదృష్టికి నగ్నసత్యాలను తీసుకొస్తున్నారు..

వాటిపై చర్చించాలనే ఇంగితజ్ఞానం ఈ ముఖ్యమంత్రికి ఉంటుందని తాముఅనుకోవడంలేదు. మిగిలినరోజుల్లో ప్రజలతరుపున తాములేవనెత్తే అంశాలపై ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రిచర్చకు వస్తేస్వాగతిస్తాం. లేకపోతేమాత్రం జగన్మోహన్ రెడ్డి తోకముడిచాడనే మేము, ప్రజలు, తాముభావించాల్సి ఉంటుంది. అర్థగంట సభలోచర్చించ డానికి తాముఇచ్చిన వాయిదాతీర్మానం తీసుకోని ఛైర్మన్, పెగాసస్ అంశాన్ని ఎలాచర్చకు తీసుకున్నారో సమాధానంచెప్పాలి. మేం నాటాసారా మరణాలు, కల్తీమద్యం అంశాలను వది లిపెట్టమని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అర్థమైంది. కాబట్టే ఈప్రభుత్వం తొలిసారి సస్పెన్షన్ అస్త్రాన్ని బయటకుతీసింది.

టీడీపీసభ్యుల్ని పోలీసులసాయంతో అడ్డుకునేదుస్థితికి ప్రభుత్వం దిగజారింది : బచ్చుల అర్జునుడు
పోలీసులకు ఈ ఖర్మ ఎందుకు పట్టిందో అర్థంకావడంలేదు. టీడీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరమేమొచ్చింది? శాసన మండలి ఛైర్మన్ ను ఇదే అంశంపై నిలదీస్తే ఆయన నోరెత్తలేదు. కృష్ణాజిల్లాలోని టీడీపీఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను పోలీసుల సాయంతో అడ్డుకునే దుస్థితికి ఈప్రభుత్వం దిగజారింది. ప్రజాసమస్యలపై మాట్లాడానికి సభకు వస్తుంటే , ఇక్కడకు రాకుండా మమ్మల్ని అడ్డుకోవడమేంటి? మద్యం విషయంలో ప్రభుత్వఅవినీతి, ముఖ్యమంత్రి దోపిడీని సమగ్ర సమాచారంతో ప్రజలముందు ఉంచుతాం. మాకు సమాధానంచెప్పకుండా ముఖ్యమంత్రి తప్పించుకోలేడు.. టీడీపీసభ్యులను భయపెట్టడం ఈముఖ్యమంత్రి తరంకాదు.

నాటుసారా మృతులకుటుంబాల ముఖాలు చూడటానికి కూడా ఈముఖ్యమంత్రికి మనసురాలేదు : అంగర రామ్మోహన్
కల్తీసారా మరణాలపై చర్చకు పట్టుపట్టి పోడియంపైకి వెళ్లామని చెప్పడం అర్థరహితం. బచ్చుల అర్జునుడుగారు, దువ్వారపు రామారావును, బీటెక్ రవిని, అశోక్ బాబును, దీపక్ రెడ్డిని , నన్ను సస్పెండ్ చేయడం దారుణం. శాసనమండలిలో ఎప్పుడూ ప్రతిపక్షసభ్యులను సస్పెండ్ చేయడం జరగలేదు. ఈ ముఖ్యమంత్రి వచ్చాకే ఇలాంటి పనికిమాలిన పోకడలకు పోతున్నాడు. నాటుసారాతాగి చనిపోయినవారి కుటుంబాలకు ముఖ్యమంత్రి న్యాయంచేయాల్సిందే. మాపార్టీ తరుపును మృతులకుటుంబాలకు రూ.లక్షచొప్పున సాయం చేశాము. అధికారంలోఉన్న ముఖ్యమంత్రిమాత్రం మృతులకుటుంబాల ముఖం కూడా చూడటానికివెళ్లలేదు. అదీ ఈముఖ్యమంత్రికి ప్రజలపైఉన్నప్రేమ. మహిళలతాళిబొట్లుతెంచుతూ, మద్యంవ్యాపారంసాగిస్తున్న ముఖ్యమంత్రి, మగాళ్ల ప్రాణాలను కూడాతనదోపిడీకి బలితీసుకుంటూ వేలకోట్లుకొల్లగొడుతున్నాడు. అధికార మదంతో సభలో సమాధానంచెప్పకుండా ముఖ్యమంత్ర్రి తప్పించుకోవచ్చుగానీ, ప్రజాక్షేత్రంలో మాత్రం దోషిగా నిలబడకతప్పదు.

LEAVE A RESPONSE