Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్.. ఆ కిక్కే వేరప్పా!

కొన్ని అద్భుతాలు, గర్వమైన మధుర జ్ఞాపకాలు మనకోసం ఎదురుచూస్తే వచ్చే కిక్ వేరు. ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్ మన లోకేష్ జెండా ఊపి ప్రారంభించడానికి వేచి చూసింది. మన ఇండియాలో కాదు.. అమెరికా.. శాన్ ఫ్రాస్కిస్కోలో!

శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి దానిని అమెరికా మార్కెట్లోకి విడుదల చేశారు. కిక్ వచ్చేది ఇది ఏపీలో పురుడు పోసుకున్న బోసన్ మోటార్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. మనకోసం వేచి చూస్తున్న అవకాశాలు అనంతరం బోసన్ సంస్థ కార్యాలయంలో పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రి లోకేష్ తో భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి ఆన్ వ్యూ సొల్యూషన్స్ ప్రతినిధి జోయల్ మంత్రి లోకేష్ కు వివరించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ కు సంబంధించి రూపొందించిన డెమోను ప్రదర్శించారు. తర్వాత ఫాల్కన్ ఎక్స్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమసంస్థ సిరిస్ ఎ స్టార్టప్ లతో వివిధ రంగాల్లో ఆవిర్కరణలకు సిద్ధంగా ఉన్న పోర్ట్ ఫోలియోలను వివరించారు.

మరిన్ని అవకాశాలు అనంతరం డిజిసెర్ట్ సిఇఓ అమిత్ సిన్హా మంత్రి లోకేష్ ను కలిసి తమ సంస్థ కార్యకలాపాలను తెలియజేశారు. డిజిటల్ సర్టిఫికేషన్, భద్రతలకు సంబంధించి డిజిసెర్ట్ సురక్షితమైన ఆన్ లైన్ ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆయా సంస్థల అనుబంధ యూనిట్లను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయాలని కోరారు. సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమలస్థాపనకు సింగిల్ విండో విధానం ద్వారా వెనువెంటనే అనుమతులతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని తెలిపారు.

ఎపి సిఎం, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నేతృత్వాన ఎపిలో పరిశ్రమల స్థాపనకు మెరుగైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేశామని లోకేష్ పేర్కొన్నారు. ఇలాంటి అవకాశాలు మనకే రాబోతున్నాయ్. హోప్ ఫర్ ది బెస్ట్.

LEAVE A RESPONSE