Suryaa.co.in

Andhra Pradesh

లోకేశ్ యువ”గంగాళం” అట్టర్‌ ఫ్లాప్‌

-అది కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వంపై నిందలు
– బాబు స్వార్థానికి ప్రతిరూపమే అమరావతి
– అమరావతిని రాజధాని చేసే హక్కు బాబుకు ఎవరిచ్చారు?
– జాతీయ స్థాయి బ్రోకర్‌ చంద్రబాబే
– దండయాత్ర చేసేంతటి పోటుగాడివా లోకేశ్?
– పాదయాత్రల పరువు తీస్తున్న లోకేశ్
– 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ దే
– వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి

అమరావతిని రాజధాని చేసే హక్కు బాబుకు ఎవరిచ్చారు?
ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పైన, రాష్ట్ర ప్రభుత్వంపైన తన అక్కసును వెళ్లగక్కాడు. అతని మాటలు చూస్తే.. వికేంద్రీకరణ జరగకూడదని, మళ్ళీ ఒక చోటే అభివృద్ధి అంతా కేంద్రీకృతం కావాలని చంద్రబాబు భావిస్తున్నట్టు ఉంది. 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 26 జిల్లాలుగా మారకూడదని బాబు భావిస్తున్నాడా?. మీరు, మీ బినామీలు అమరావతిలో కొనుగోలు చేసిన భూముల ధరలు పెంచుకునేందుకు, శివరామకృష్ణయ్య కమిటీ నివేదికను పూర్తిగా పక్కకు తోసేసి, మొక్కుబడిగా నారాయణ కమిటీ వేసి, ఎవరికీ ఇష్టం లేకపోయినా అమరావతిలో కుట్ర పూరితంగా రాజధాని ఏర్పాటు చేశారు. మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న విషయం జగద్వితం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాంతీయ వాదం బలంగా ఉంది. అందువల్లే రాష్ట్రం రెండుగా విడిపోయింది. మళ్ళీ ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కు రాకూడదనే జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత, శివరామకృష్ణయ్య కమిటీ, శ్రీ కృష్ణ కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ, జీఎన్‌రావు కమిటీ.. ఇలా నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా, రాష్ట్ర విశాల హితాన్ని దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను నిర్ణయించారు. గతం తాలూకూ చేదు అనుభవాల దృష్ట్యా ఇప్పటికే విడిపోయి నష్టపోయామని, మరో విభజన రాకూడదన్న దూరదృష్టితో మూడు రాజధానుల చట్టం తెస్తే, దాన్ని ఎలాగైనా తిరస్కరించడానికి మీరు చేస్తున్న కుట్రలు గమనించిన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల జనం మిమ్మల్ని అసహ్యించుకుంటున్న మాట నిజం కాదా చెప్పండి. మూడు రాజధానులు చేసే హక్కు జగన్‌ కి లేదని బాబు తీర్మానిస్తున్నాడు. మరి అమరావతిని రాజధానిని చేసే హక్కు మీకెవరిచ్చారు.

జాతీయ స్థాయి బ్రోకర్‌ చంద్రబాబే
ఇక ఈ యువగంగాళం పాదయాత్రకు జనం రావడం లేదని, అతని తండ్రి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ ని, మా పార్టీ ఎంపీలను తిట్టాడు. రాజ్యసభ ఎంపీలు ముగ్గురు పరిమళ్‌నత్వానీ, నిరంజన్‌ రెడ్డి, కృష్ణయ్యలను బ్రోకర్లని నిందించాడు. చంద్రబాబుకంటే పెద్ద బ్రోకర్ ఎవరన్నా ఉన్నారా? చంద్రబాబే జాతీయ స్థాయిలో పెద్ద బ్రోకర్‌ కాదా? ఓ రెండు మూడు దశాబ్దాల వెనక్కి వెళ్తే ఇన్ని పత్రికలు, ఛానళ్లు లేవు కనుక ఈనాడు ఏం రాసినా అదే వేదమై కూర్చుంది. ఆ రోజులు పోయాయి. బాబు చేసిన బ్రోకర్‌ పనులకు, మద్యం, మగువ, డబ్బును ఎరవేసి చేసిన పనులపై కనుక దర్యాప్తు చేస్తే ఆయనకు వెయ్యేళ్ళు శిక్ష పడితీరుతుంది.

యువ”గంగాళం” అట్టర్‌ ఫ్లాప్‌
లోకేష్ .. యువగంగాళం కార్యక్రమం నడుస్తోంది. యువగంగాళమైన లోకేశ్‌ పాదయాత్రలో జనం లేరని అన్ని మీడియాలు బట్టబయలు చేసి చూపిస్తుంటే తట్టుకోలేని టీడీపీ- ఏదోలా జగన్‌ ని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపైన ఆ ఉక్రోషాన్ని చూపుతూ నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. మనం టీవీల్లో వార్తలు చూసిన తర్వాత కాస్త ఉపశమనం కోసం వేరే ఛానల్‌ మార్చినప్పుడు కామెడీ ఛానల్‌ కనిపిస్తుంది. ఆ కామెడీ ఛానల్‌ యువగంగాళం…భలే హాస్యాన్ని పండిస్తున్నాడు ఈ యువగంగాళం. ఈ యువగంగాళం నిండా పప్పుంది. పప్పును తిప్పడానికి ఒక గుత్తి ఉంది. పప్పును ఉడకబెట్టడానికి ఎల్లోమీడియా అనే నిప్పుంది. కాని ఈ గంగాళంలో విషయంలేనప్పుడు ఎల్లోమీడియా ఎంత నిప్పు రాజేసినా, ఫలితం ఏముంటుంది?. ఈ పాదయాత్రను కొనసాగించలేక, ఏదోలా ఆపేయడానికి పోలీసు రక్షణ లేదంటూ చంద్రబాబు, లోకేశ్‌లు, టీడీపీ నాయకులు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు.

జగన్‌ కే సవాలు విసిరేంతటి వాడివా మందబుద్ధీ
తెలుగులో ఒక్క అక్షరం సరిగ్గా పలకలేని, నోరు తిరగని ఈ మందలగిరి మాలోకం…యువతను ఉద్ధరిస్తానని తిరుగుతున్నాడు. ఇతనే ఒక అసమర్థుడు, సంస్కార హీనుడు.. అలాంటి లోకేశ్ మరొకర్ని ఉద్ధరించడమా..?. ఇలాంటి వాడు జగన్‌ ని నేరుగా వస్తావా? అంటూ సవాళ్ళు విసురుతాడు. ఇలాంటి సవాళ్లకు జనం నవ్విపోతారన్న సిగ్గూ ఎగ్గూలేని దద్దమ్మ ఈ యువగంగాళం. ఏం చూసుకుని నీకీ మిడిసిపాటు. నీ స్థాయి ఏంటి లోకేశ్‌? రెండు సార్లు ఎంపీగా, అదికూడా 5,45,000 ఓట్ల వెజార్టీతో జగన్ గెలిచారు. ఇప్పుడు, 151 సీట్ల భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి అయిన ఘనత జగన్‌ కి ఉంది. మరి నిన్ను నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు కనిపించేదేమంటే.. మంగళగిరిలో నువ్వు చిత్తుచిత్తుగా ఓడి, అడ్డదారిలో ఎమ్మెల్సీ అయిన నిన్ను, తన కేబినెట్ లో మూడు శాఖలకు మంత్రిని చేశాడు నీ బాబు. అసలు మీ తండ్రి టీడీపీని నేరుగానే తెచ్చాడా? నీ తాతకు వెన్నుపోటు పొడిచి లాక్కున్న పార్టీ మీది. మరి జగన్ ఒంటరిగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు.

పాదయాత్రల పరువు తీస్తున్న లోకేశ్
గతంలో ఎంతోమంది మహానుభావులు పాదయాత్రలు చేశారు. పాదయాత్రల యొక్క పవిత్రతను, పాదయాత్ర యొక్క అర్థాన్ని మార్చేస్తూ, పాదయాత్ర పరువు తీసేలా లోకేశ్ యాత్ర జరుగుతుంది. గతంలో రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత జగన్‌ చేసినవి అసలు సిసలు అయిన పాదయాత్రలు. కోట్లాది మంది ప్రజలను వారు అక్కున చేర్చుకున్న తీరు…జనం వారి పట్ల చూపిన ప్రేమానురాగాల తీరు… అదీ పాదయాత్రంటే… అంతేగాని నోరుతిరగని నీలాంటి మందబుద్ధులు, పది రోజుల పాదయాత్రకే నడవలేక , నోట మాట పెగలక…పనికిమాలిన చెత్తవాగుడు మాట్లాడుతుంటే అదంతా జనం భరిస్తారనుకుంటున్నావా? నీ బూతులు వినడానికి వస్తారనుకుంటున్నావా?

దండయాత్ర చేసేంతటి పోటుగాడివా?
దండయాత్ర చేస్తానని.. ఇంకొక డైలాగు విసురుతాడు ఈ యువగంగాళం…దండయాత్ర అంటే నీ తండ్రి చేసినట్లు, దోమలపై దండయాత్ర అనుకుంటున్నావా? తన తండ్రిని రాముడిగా కీర్తించుకుంటూ…తనను తాను మూర్ఖుడిగా చెప్పుకుంటున్న లోకేశ్ మూర్ఖుడే కాదు, అంతకు మించి పనికిమాలిన వాడు. తనకు తానే మూర్ఖుడిని అని లోకేశ్‌ అంగీకరించాడు అంటే, ఇది చాలదా అతనెంత అజ్ఞానో…

6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ దే
జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రగతి చక్రాలు దూసుకు వెళుతున్నాయి. ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రతి పైసా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లడం మొదలయింది జగన్‌ హయాంలోనే. అలాంటి జగన్‌ గారిపై ఇష్టమొచ్చినట్లు నిందలేస్తూ మాట్లాడితే మా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఊరుకోదు గాక ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. మేమే కాదు జనమే మీకు బుద్ధి చెబుతారని గుర్తుంచుకోండి. జగన్‌ హయాంలో ఉద్యోగ నియామకాలు లేవని విమర్శలు చేస్తారా?. అధికారంలోకి వచ్చిన వెంటనే 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్‌ కి దక్కుతుంది. మరి బాబు హయాంలో తన కొడుక్కి మాత్రమే ఉద్యోగం వచ్చింది. చంద్రబాబుకు కళ్లు మసకబారి పోయి, భవిష్యత్తు అగమ్యగోచరమైపోయిన స్థితిలో.. ఇలా మతి తప్పి అవాకులు చవాకులు పేలుతున్నాడు. 2024 లో 175కు 175 సీట్లు గెలుస్తాం. జగన్‌ సత్తా ఏమిటో ప్రతిపక్షాలు మరోసారి రుచి చూస్తాయి.

LEAVE A RESPONSE