Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్‌ చేతికి గాయం

రక్తం వస్తున్నా ఆగని పలకరింపులు
చేతికి రక్తస్రావంతో టీడీపీ నేతల ఆందోళన
లైట్‌ తీసుకోండని చెప్పిన లోకేష్‌

నర్సరావుపేట జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ యువనేత లోకేష్‌ చేతికి గాయమయింది. చేతికి రక్తం వస్తున్నా, కర్చీఫ్‌తో తుడుచుకుంటూనే జనాలకు అభివాదం చేశారు. తనకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి వచ్చిన వారికి ప్రతిగా షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. ఇది చూసిన సెక్యూరిటీ, లోకేష్‌కు తమ వద్ద ఉన్న మెడికల్‌ బ్యాండెయిడ్‌ను చుట్టారు. తర్వాత పాదయాత్ర మామూలుగానే సాగింది. ఓవైపు చేతితో రక్తం తుచుడుచుంటూ, ఇంకో వైపు తనకు షేక్‌హ్యాండ్‌ ఇస్తున్న వారికి ప్రతిగా షేక్‌హ్యాండ్లు ఇస్తూ, ముందుకు సాగిపోవడం కనిపించింది.

 

LEAVE A RESPONSE