– రాయలసీమలో ఫ్యాక్షన్ బారినపడి సర్వం కోల్పోయిన బోయ నరసింహులు కుటుంబం
– ప్రత్యర్థుల చేతుల్లో నరసింహులు సహా ముగ్గురి కిరాతక హత్య
– కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మాట్లాడిన మంత్రి
– కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన లోకేష్
ఉండవల్లి: రాయలసీమలో ఫ్యాక్షన్ బారినపడి నష్టపోయిన కుటుంబాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసానికి పిలుపించుకుని మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం కామిరెడ్డిపల్లికి చెందిన దాసరి నరసింహులు టీడీపీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దీంతో ప్రత్యర్థులు దారికాచి 2011లో ద్విచక్రవాహనంపై వెళ్తున్న బోయ నరసింహులు సహా అతని కుమారుడు, కుమార్తెను దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది.
ఫ్యాక్షన్ బారిన పడి బోయ నరసింహులు కుటుంబం ఎంతో నష్టపోయింది. అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పుడు మృతుడి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
మృత్యుంజయ చిన్నారిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్
ఆనాటి ఫ్యాక్షన్ హత్యా ఘటనలో రెండు నిలల చిన్నారి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఆ బాలుడిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నతస్థాయికి వెళ్లాలని, తాను కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసానికి పిలుపించుకుని తమ యోగక్షేమాలు వాకబు చేయడం పట్ల బోయ నరసింహులు కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.