Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల కష్టాలను, సమస్యలను వారి కోణం నుండి చూడండి: జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి

ప్రజల కష్టాలను, సమస్యలను వారి కోణం నుండి చూడండి.. సావధాన చిత్తంతో, సహృదయంతో పరిష్కరించండి.. – ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి సూచన.

కాకినాడలో క్యాంపు కోర్టు నిర్వహించిన రాష్ట్ర మానవ హక్కుల కమీషన్, సాయంత్రం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో జిల్లా అధికారులు, మానవ హక్కుల కార్యకర్తలు, మీడియా ప్రతినిధులకు మానవ హక్కుల పరిరక్షణ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కమీషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, సబ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు, సెక్రటరీ అండ్ సిఈఓ సంపర వెంకటరమణ మూర్తి పాల్గొని వివిధ అంశాలపై సభికులకు విశదీకరించారు. ఈ సందర్భంగా2 కమీషన్ చైర్మన్ జస్టీస్ సీతారామమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగపరమైన, చట్టపరమైన, రాజకీయమైన అన్ని హక్కులు మానవీయ కోణం ఉన్న అన్ని అంశాలు మానవ హక్కుల క్రిందకే వస్తాయని, ప్రజల ఈ హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వ అధికారులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రజల కోసం నిర్వహించే ప్రభుత్వ పనులను దైవీయమైన పనులుగానే భావించాలని, ప్రజల పట్ల, దేశం పట్ల ప్రేమను పెంచుకోవాలన్నారు. ప్రజల సమస్యలను వారి కోణం నుండి దర్శించి పరిష్కరించాలని, వారి పట్ల గౌరవంతో వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వ వ్యవస్థలన్నిటిలో సిబ్బంది కొరత ఉందని, ప్రజలకు సేవలందించేందుకు అధికారులు కొద్ది గంటలు అదనంగా పనిచేస్తే దీనిని అధిగమించవచ్చునన్నారు.

ప్రజలతో సంయమనం, ప్రశాంతతో వ్యవహరించాలని, గౌరవించక పోయినా, అపహాస్యం చేయవద్దని సూచించారు. మానవ హక్కుల కేసులలో రిపోర్టులు, రిప్లైలు, అబ్జక్షన్లు, కౌంటర్లు దాఖలు చేసేపుడు అధికారులు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులందరూ పాటించాలని3 ఆయన కోరారు. అలాగే మానవ హక్కుల పరిరక్షణ కొరకు పనిచేస్తున్న సంస్థలు జాతీయ, రాష్ట్ర మానవ హక్కల కమీషన్ పేరు స్పురించేలా తమ సంస్థ పేర్లను పెట్టుకోకూడదని తెలియజేశారు. కక్షిదారుల సౌకర్యం కొరకు క్షేత్ర స్థాయిలో కమీషన్ నిర్వహిస్తున్న క్యాంపు కోర్టులకు మంచి స్పందన లభిస్తోందని, ఇందులో భాగాంగానే కాకినాడ, రాజమహేంద్రవరంలలో క్యాంపు కోర్టులు ఏర్పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు.

కాకినాడలో నిర్వహించిన సిట్టింగ్ లో రెవెన్యూ, పోలీస్, జిల్లా పరిషత్, విద్యుత్ తదితర శాఖలకు చెందిన మొత్తం 18 కేసులకు సంబంధించి ఆయా శాఖల అధికారులు, ఫిర్యాధుదారులతో హియరింగ్ నిర్వహించడం జరిగిందని, వీటిలో 4 కేసులు పరిష్కరించగా, 14 కేసులను వాయిదా వేయడం జరిగిందని కమీషన్ కార్యాలయం తెలియజేసింది. ఈ కార్యక్రమంలో జడ్ పి సిఈ ఎన్.వి.వి.సత్యన్నారాయణ, కాకినాడ ఆర్డిఓ బివిరమణ, కమీషన్ పిఆఓ కె.రవికుమార్, విభాగాధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు ,మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE