– శివుడికి శివుడు మొక్కడం తప్పు కాదు
– అందుకే ఆయన కాళ్లు మొక్కా
– శ్రీశైలం ఈవో లవన్న
నాకు జగద్గురు పీఠాధిపతి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు ఒకటే. జగద్గురు స్వామి, పెద్దిరెడ్డి ఇద్దరి కాళ్లు మొక్కుతా. అందులో తప్పేముంది? మంత్రి పెద్దిరెడ్డి, నేను ఒకే ఊరి వాళ్ళము.. 76 సార్లు అయ్యప్ప మాల పెద్దరెడ్డి వేశారు.
అందరిలోనూ శివుడు ఉన్నాడు.. నాలో ఉన్నాడు.. మంత్రి పెద్దరెడ్డి లో కూడా శివుడు ఉన్నాడు.. అందుకే ఆయన కాళ్లు మొక్కాను. నేను గర్భగుడిలో కాళ్లు మొక్క లేదు.. గేట్ దగ్గర మంత్రి కాళ్లు మొక్కాను తప్పేంటి ఏంటి. తనకు పెద్దరెడ్డి శివుడితో సమానమన్న లవన్న… శివుడికి శివుడు మొక్కడం తప్పు కాదు. మంత్రి పెద్దిరెడ్డి నా గురువు. నేను ఏ తప్పు చేయలేదు.