Home » అయోధ్య నుంచి కొండగట్టుకు రాముడి బాణం

అయోధ్య నుంచి కొండగట్టుకు రాముడి బాణం

– అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు
(వెంకట్)

జగిత్యాల : అయోధ్య బాల రాముడి కోసం బంగారం, వెండి మిశ్రమాలతో ప్రత్యేకంగా తయారు చేసిన బాణం ఈ రోజు ఉదయం కొండగట్టుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలకు ఈ బాణాన్ని తీసుకెళుతూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం అంజన్న సన్నిధికి చేరింది. నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస శర్మ అనే భక్తుడు బాల రాముడి కోసం ఈ బాణాన్ని తయారు చేయించాడు.

ఈ బాణాన్ని దేశం లోని ప్రముఖ ఆలయాలను సందర్శింప జేసి చివరగా అయోధ్యకు తీసుకు వెళ్లి బాల రాముడికి సమర్పిస్తామని శ్రీనివాస్ శర్మ తెలిపాడు. ప్రస్తుతం ఈ బాణానికి కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపాడు. కార్యక్రమంలో ఈవో చంద్ర శేఖర్, ప్రధాన అర్చకుడు జితేంద్ర ప్రసాద్, స్థానచార్యుడు కపిందర్, ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply