Suryaa.co.in

Telangana

అదే పలకరింపు, అదే ఆదరణ…. ఎక్కడికెళ్లినా మోడీ మీద అదే ప్రేమ

– మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా ఇవ్వాళ ముషీరాబాద్ నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కు ప్రజల బ్రహ్మరథం
– ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నంబర్ 131,132,133లోవిస్ర్తుత పర్యటన
స్వామి వివేకానంద నగర్ బస్తీ, క్రుపారావ్ లేన్, బాలాజీ ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్స్ అండ్ జనప్రియ అబోడ్ లేన్ ల లో ప్రజలతో మమేకం

హైదరాబాద్ ; మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గాంధీ నగర్ డివిజన్ ప్రజలతో మమేకం అయ్యారు . స్వామీ వివేకానంద నగర్ బస్తీ లో మొదలయ్యి జనప్రియ అబోడ్ వరకు ఈ కార్యక్రమం సాగింది. 131, 132, 133 పోలింగ్ బూత్ ల లో బస్తీ ప్రజలు, అపార్ట్మెంట్ ప్రజలు, వీధి వ్యాపారుల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచి గత తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కారు చేసిన అభివ్రుద్ది కార్యక్రమాలను వివరించారు.

మోడీ చేసిన పనులను చెప్పాల్సిన పనే లేదు పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే లోపు మోడీ గారు పనులను కళ్లారా చూస్తున్నామని ప్రజలే డాక్టర్ లక్ష్మణ్ గారికి చెబుతున్నారు. వెళ్లిన ప్రతీ ఇంటికి కూడా స్టిక్కర్ వేయడంతో పాటు అందరికీ నరేంద్రమోడీ పనులకు సంబంధించిన కరపత్రాలను అందించారు. ముద్రాలోన్లు అందుకున్న వీధి వ్యాపారులు ఆ సంతోషాన్ని డాక్టర్ లక్ష్మణ్ తో పంచుకున్నరు. దేశం కోసం నిస్వార్ధంగా పనిచేస్తోన్న ప్రియతమ ప్రధాని కోసం నేరుగా ప్రతీ రోజు వింటున్న విషయాలను ప్రజలే వివరిస్తున్నారంటే సాధారణ ప్రజల్లో నరేంద్రమోడీ ముద్ర ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు.

వెళ్లిన ప్రతీ ఇంటిలో కూడా మహిళలు పెద్ద ఎత్తున నరేంద్రమోడీ కి మద్దతు పలికారని , ఈ స్పందన చూస్తుంటే 2024 ఎన్నికల్లో మరోసారి నరేంద్రమోడీ సర్కారు ఖాయమని డాక్టర్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. గాంధీ నగర్ కార్పోరేటర్ పావని వినయ్ కుమార్ తోపాటు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE