కొడంగల్: కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్మరస్పెట్ మండలం రేగడి మైలారం గ్రామంలో పిచ్చికుక్క దాడి చేయడంతో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఆరుగురు చిన్నారులను హైదరాబాద్ తరలించగా మిగతా వారిని ప్రవేట్ ఆసుపత్రులకు తరలించారు.గురువారం ఉదయం స్కూల్ కి వెళ్లే క్రమంలో పిచ్చికుక్క దాడి చేసింది. చికిత్స పొందుతున్న చిన్నారులందరూ క్షేమంగా ఉన్నారని వైద్యలు వెల్లడించారు.