పేదల నోటికాడ కూడు లాగేయడం శాడిజం
– నారా లోకేష్
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆకలి తీర్చడమే అన్నాక్యాంటీన్లు చేసిన పాపమా? క్యాంటీన్ ముందు అన్నా అని పేరుండడమే వాటి పాలిట శాపమా? సీఎం అయిన వెంటనే రంగులు మార్చావు, తాళాలేశావు, చివరికి మూతేశావు. పేదల నోటికాడ కూడు లాగేయడాన్ని శాడిజం అంటారు జగన్ రెడ్డి గారూ! అన్నాక్యాంటీన్ పేరు నీకు నచ్చలేదంటే..పేదల్ని జలగల్లా పీల్చేస్తున్న నీ దుర్మార్గ పాలనకి గుర్తుగా జలగన్న క్యాంటీన్లు అని పేరుమార్చి నడిపినా పేదల ఆకలి తీరేది. మదనపల్లె పట్టణంలో మూతపడిన అన్నా క్యాంటీన్ ఇది. ఎంతమంది ఆకలితో అన్నాక్యాంటీన్వైపు చూసి నువ్వు వేసిన తాళాలు వెక్కిరిస్తుంటే నిరాశగా వెళుతున్నారో?