తిరుపతి: తిరుపతిలో ఛాయ్ పే చర్చలో బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీ నివాస్ తో బైక్ పై సాధారణ వ్యక్తి లా కార్యక్రమంలో పాల్గొనేందుకు మాధవ్ రావడం విశేషం. కాగా, మాధవ్ మాట్లాడుతూ సారథ్యం యాత్రకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితో ప్రారంభించాం. ఛాయ్ పే చర్చ లో స్థానికులు నుండి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఛాయ్ పే చర్చ కార్యక్రమం కేవలం స్థానికులతో నిర్వహిస్తున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్టణాలు, నగరాలు అభివృద్ధికి కంకణబద్ధులై ఉన్నారన్నారు.
రాష్ట్రంలో తిరుపతి, విశాఖ, కాకినాడ లను స్మార్ట్ సిటీ లో పథకంలో ఒక్కో నగరానికి 100 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర రాజధాని అమరావతి ని కూడా స్మార్ట్ సిటీ పథకం అమలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. ఛాయ్ పే చర్చ లో స్థానిక అంశాలతో పాటు సాంస్కృతిక వైభవాన్ని తెలుసు కోవచ్చన్నారు. ఈ సందర్భంగా మాధవ్ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వాకర్స్ కు సౌకర్యాలు వంటి వినతులు స్వీకరించారు.