ఒంగోలు: ప్రకాశం జిల్లా, ఒంగోలులో ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్‌కు ఘన స్వాగతం లభించింది. స్థానిక పాత కూరగాయల మార్కెట్ వద్ద నుంచి, ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ అంగరంగ వైభవంగా సాగింది.
రాష్ట్ర అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. వారు గజమాలలతో మాధవ్‌కు ఆహ్వానం పలికారు. ఒంగోలు చరిత్రలో ఒక రాష్ట్రస్థాయి అధ్యక్షుడికి ఇంతటి కోలాహలంగా స్వాగతం పలకడం ఇదే మొదటిసారి అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కార్యకర్తల ఉత్సాహం ఒంగోలులో కొత్త సందడిని సృష్టించింది. ర్యాలీ అనంతరం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.