Suryaa.co.in

Editorial

మాధవ లీల.. సోషల్ మీడియా గోల

– రాసలీలల్లోనూ తగ్గేదేలే..
– వీడియోను షేర్ చేసిన వారందనీ అరెస్టు చేస్తారేమో?
– ‘మార్ఫింగు’ ఆరోపణలు తేల్చేదెవరు?
– మరి వైసీపీ ప్రతిష్ఠ పెరిగినట్టేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలున్న వైఎస్సార్‌సీపీది అన్నింటా రికార్డుల మీద రికార్డులే. అప్పులు, ఆరోపణల్లోనూ రికార్డులే. అయినా సీఎం, పార్టీ అధినేత జగనన్న నోరు విప్పరు. మీడియా ముందుకు రారు. సంబంధిత శాఖల మంత్రులు పెదవి విప్పరు. సమస్య ఏదయినా.. సందర్భం ఏదయినా.. ఒక సజ్జల.. ఒక విజయసాయిరెడ్డి.. వీళ్లే ముఖ్యమంత్రి, మంత్రుల అవతారమెత్తి అనుగ్రహ భాషణ చేస్తుంటారు. వీరితోపాటు, పార్టీ సోషల్‌మీడియా దృశ్య రూపాల్లో దర్శనమిస్తుంటుంది. గత మూడేళ్లుగా ఆంధ్రా ప్రజలు, మీడియా చూస్తున్న దృశ్యాలు ఇవే. కాదంటారా?

అప్పుడు ఒక అంబటి రాంబాబు.. ఇంకో అవంతి శ్రీనివాస్.. మరో జోగి రమేష్.. ఇంకో పృధ్వీరాజ్..3-BL3-NOz-WA3-Y-HDఅంతేనా? వివాహితను కిడ్నాప్ చేసిన వాలంటీరు.. వితంతును తన ఇంటికి రావాలన్న సర్పంచ్.. పేరు ఏదైతేనేం? హోదాలు ఏమైతేనేం? అంతా వైసీపీ మహానుభావులే. గంట.. అరగంట.. వెనుకనుంచి.. ఇలా.. వీరంతా సోషల్‌మీడియాలో పట్టం కట్టించుకున్న ప్రముఖులే. వీరంతా వైసీపీ ప్రతిష్ఠను ఇతోథికంగా, తమ శక్తి మేరకు ఇనుమడింపచేస్తున్న మహానుభావులే. లేటెస్టుగా… అనంతపురం ఎంపీ మాధవ్! తర్వాత ఎంటరయ్యే పాత్ర ఎవరన్నది ‘జగన్నా’దుడికెరుక?

మాధవుడంటే శ్రీకృష్ణుడన్నమాట. కృష్ణపరమాత్మ శృంగారలీలలు, వర్ణన భాగవతంలో కనిపిస్తుంటుంది. కానీ శ్రీకృష్ణుడి పేరు పెట్టుకున్న మాధవ్ అంత గలీజుగా.. కృష్ణపరమాత్ముడి శృంగార ఘట్టాలను ఏ మహాకవీ రాసిన దాఖలాలు లేవు. బహుశా భాగవతం రాసిన బమ్మెర పోతన కూడా, ఈనాటి మాధవుడి శృంగార రాస లీలలను ఊహించి ఉండరు పాపం! అందుకే దేవుడు కూడా చేయలేని పనిని సోషల్‌మీడియా చేస్తోంది. దేవుడి పేరు పెట్టుకున్న వాళ్లంతా పుణ్యాత్ములయిపోరు. ఆ మాటకొస్తే తెలుగురాష్ట్రాల్లో దేవుళ్ల పేరుతోనే వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్టూ దర్శనమిస్తుంటాయి. అది వేరే ముచ్చట.

అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అనే కండలు తిరిగిన శృంగార వీరుడి ముచ్చట నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఎవరో మహిళామణికి.. బహుశా ఆమెవరో సారుకు తెలిసే ఉండవచ్చు. లేకపోతే అంత స్వేచ్ఛగా, అంత విచ్చలవిడి భావోద్వేగంతో మాధవ్ సారు.. తన ‘కోరికల గుర్రాన్ని’ సదరు మహిళామణికి ప్రదర్శించి ఉండరు.

‘బ్రహ్మకయినా పుడుతుంది రిమ్మ తెగులు’ అన్నట్లు.. ‘ఎంతవారలయినా కాంతదాసులే’ అని త్యాగరాయ కీర్తనలో చెప్పినట్లు… సారు పేరులోనే ఎంత మాధవుడున్నాడున్నా.. ఆయనకూ రిమ్మ తెగులు పుట్టింది కాబోలు. అంతలావు బ్రహ్మకే రిమ్మతెగులు పుడితే..ఆఫ్టరాల్ మానవుడయిన మన మాధవుడికి రిమ్మతెగులు పుట్టడంలో పెద్ద తప్పేం లేదన్నది ఆయన అభిమానుల వాదన. అందునా.. రోజూ లక్షా తొంభై వర్రీస్‌లో ఉండే సారు..పార్లమెంటులో రోజూ తన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడి.. అలసి సొలసిపోయే తమ సారు.. ఇష్టసఖితో ‘అన్నీ విప్పి’ మాట్లాడుకోవడం తప్పెలా అవుతుందన్నది మాధవాభిమానుల ప్రశ్న.

సారు ఏదో ముచ్చట పడి, తన ప్రాణసఖితో ‘శృంగారనైషధం’లో ఉన్నప్పుడు, దుర్మార్గులెవరో ఆ సుందర- సుమధుర- రస దృశ్యాలను సోషల్‌మీడియాకు లీక్ చేయటం కరెక్టు కాదన్నది మాధవాభిలాషుల ఆగ్రహం. అదీ నిజమే! అవును మరి. ఎంపీలన్న తర్వాత సవాలక్ష సమస్యలు, వేయి వర్రీసూ ఉంటాయి. వాటి నుంచి బయటపడేందుకు ఒక్కోరు ఒక్కో మార్గం వెతుక్కుంటారు. ఆ రిలీఫ్‌కు ఒక్కోరకమైన పేర్లుండవచ్చు. ఆ సుఖపడే శుభవేళలను కొందరు గోప్యంగా ఉంచుతారు. మరికొందరు ఇలా బహిరంగంగా వ్యక్తీకరిస్తుంటారు. అలా ఎవరి టేస్టు వారిది. ఎవరి సుఖానందం.. శునకానందం వారిది. కాకపోతే దొరికనవాడు దొంగ. దొరకని వాడు దొర. అంతే తేడా! మహేష్ సినిమాలో విలన్.. తన ఇష్టసఖితో తాళ్లతో చేతులు మంచానికి కట్టించుకుని, చర్నాకోల్‌తో కొట్టించుకుని ఆనందపడిపోతాడు. అలాగే.. మన మాధవసారు టేస్టు వేరు కావచ్చు. ఆయన టేస్టు ఇప్పుడు అందుబాటులో ఉన్న సోషల్‌మీడియాలో వీడియోలా ఉండవచ్చు. అంతదానికే సోషల్‌మీడియా ఇంతగా రెచ్చిపోవాలా? ఇదేం బాగోలేదు.

అప్పటికీ.. తన ఫ్రంట్.. బ్యాక్ ఎక్సర్‌సైజ్ వీడియోలను మాధవ సారు మీడియాకు చూపించి, తాను నిర్దోషినని, ఇదంతా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుట్రేనని ఆరోపించారు. తన జిమ్ వీడియోలను మార్ఫింగ్ చేసి, తనను శృంగారపురుషుడిగా ప్రచారం చేసిన వారిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. కానీ బ్యాడ్ లక్.. అప్పటికే కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజలు.. మాధవుడి సుందర దివ్య స్వరూపం, ఆయనలో ‘నిద్రలేచిన’ శృంగారపురుషుడిని సోషల్‌మీడియా పుణ్యాన దర్శించేశారట. కాబట్టి సార్‌వాడి వివరణ, ఆ స్థాయిలో వెళ్లే చాన్సు లేదన్నది రాజకీయ విశ్లేషక ఉవాచ.

radhakrishnaమాధవుడి రాసలీలలో.. ఏబీఎన్ రాధాకృష్ణకు ఏం సంబంధం అన్న కోణంలో కాసేపు చర్చిద్దాం. ఎంపీ మాధవ్ శృంగారరసాన్ని అందరికంటే ముందు కనిపెట్టి, ఆయన రసానుభూతిని బయటపెట్టింది సోషల్‌మీడియా. దానిని క్యాచ్ చేసి, టెలికాస్టు చేసిన మొదటి చానెల్ ఏబీఎన్. మిగిలిన చానెళ్లకూ అంత దమ్ము, ధైర్యం ఉంటే.. కనీసం మాధవుడి లీలలకు సంబంధించి ‘కీలక భాగాలను’ మార్ఫింగ్ చేసయినా టెలికాస్టు చేయాలి కదా? కనీసం సదరు మహిళె వరో కనిపెట్టి.. ఇదంతా నిజమా? అబద్ధమా అని ఆమెతో లైవు టెలికాస్టుల హడావిడయినా చేసి ఉండాల్సింది కదా?

పోనీ.. ఆ దమ్ము, ధైర్యం ఏడవకపోయినా.. జరిగిన దౌర్భాగ్యపు యవ్వారంపై వైసీపీ శ్రేణులు, జగనన్నను ప్రేమించే అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు అసహ్యంతో తలదించుకుంటున్నారన్న కథనాలయినా ఇవ్వాలి కదా? ఈ దిక్కుమాలిన ‘మిడ్‌నైట్ మాసాలా’తో పార్టీ మహిళా కార్యకర్తలు సిగ్గుతో చితికిపోతున్నారన్న కోణంలో వారితో ఇంటర్వ్యూలయినా చేయాలి కదా?.. ఉహు.. ఘనత వహించిన మీడియా మోతుబరులేవీ ఆ పనిచేయలేదు. తనకు అందివచ్చిన ఆవకాశాన్ని ఏబీఎన్ ధైర్యంతో సద్వినియోగం చేసుకుంది.

అంతమాత్రాన.. అక్కడికేదో ఏబీఎన్ రాధాకృష్ణ.. తన ‘దృశ్యరసాత్మక’ ఘట్టాన్ని రహస్యంగా వీడియో తీసినట్లు, రాధాకృష్ణపై మాధవుడి తిట్ల దండకమే ఆశ్చర్యం. అసలు బుద్ధి బుర్ర ఉన్న ఎవరైనా ఎలా ఆలోచిస్తారంటే.. సదరు వీడియో చాటింగు సుందర-శృంగార ఘట్టంలో పాత్రలు రెండే. ఒకటి మాధవుడు. మరొకరు ఆయన ఇష్టసఖి. ఆ సుందర దృశ్యాలను లీక్ చేస్తే మాధవుడు చేయాలి. లేకపోతే ఆయన ఇష్టసఖి చేసి ఉండాలి. దీనితో సంబంధం లేని ఏబీఎన్, దాని అధిపతి రాధాకృష్ణకు ఈ యవ్వారంతో ఏం బాదరాయణ సంబంధం? ఆ కోణంలో మాజీ పోలీసు సారు ఆలోచిస్తే, అసలా వీడియో ఎలా లీకయిందో తెలిసిపోయే దానికి, రాధాకృష్ణ, సుబ్బారావు, పుల్లారావును తిడితే ఏం ప్రయోజనం?

chinntakayala-vijayఇక మాధవుడు చెప్పినట్లు.. చింతకాయల విజయ్ పాత్ర గురించి మాట్లాడితే.. ఆయన టీడీపీ సోషల్‌మీడియా ఇన్చార్జి. కాబట్టి సహజంగానే తన ప్రత్యర్ధి జుట్టు చేతికి వచ్చిన తర్వాత, దానిని వదిలేయరు కదా? అందునా.. మొన్నీమధ్యనే ఆయన ఇంటి గోడను సర్కారు కూల్చేసింది కూడా. సో.. సమయం వచ్చింది కాబట్టి, విజయ్ తన పని తాను కానిచ్చి ఉండవచ్చు. టిట్ ఫర్ టాట్. ఇందులో పాప పుణ్యాల ముచ్చటకు తావు లేదు.

సరే.. తన శృంగార దృశ్యాలకు సంబంధించిన కుట్రపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న మాధవ్ హెచ్చరిక మంచిదే. కానీ.. ఆ వీడియోలను సర్కారు ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతుందా లేదా అన్న విషయాన్ని, తాజాగా మీడియాముందుకొచ్చిన ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా చెప్పలేదు. మరి ఎవరిని దోషిగా

తేలుస్తారు? ఎలాతేలుస్తారు? సజ్జల చెప్పినట్లు.. మాధవుడి వీడియో కథ నిజమైతే చర్చలు తప్పవన్న కోణంలో చూస్తే.. దానిని ఎలా తేలుస్తారన్నది ఇంకో ప్రశ్న. ఇంత జరుగుతున్నా.. యధాప్రకారం ఈ వ్యవహారంపై, హోంమంత్రి మాత్రం ఇంకా స్పందించలేదు.

తాజా మాధవుడి శృంగారఘట్టంపై మరి విజయసాయిరెడ్డి ట్వీట్ చేయరా? అన్న టీడీపీ ప్రశ్నలకు ఆయనెలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే.. టీడీపీని రోజూ ట్విట్టర్‌లో చాకిరేవు పెడుతున్న ఆయన, మాధవ్ యవ్వారంపై ఇప్పటిదాకా స్పందించకపోవడమే ఆశ్చర్యం. మాధవ్ చేసింది తప్పో, ఒప్పో అన్నది కూడా తేల్చకుండా.. విజయసాయి వ్యూహాత్మక మౌనం పాటించడమే వింత. ఎక్కడో హైదరాబాద్‌లో నాలుగు గోడల మధ్య ఆత్మహత్య చేసుకున్న ఎన్టీఆర్ కూతురు అంశంపై, వరస వెంట వరస ట్వీట్లు పెట్టిన విజయసాయి.. ఓపెన్‌గా వీడియోల్లో సాక్షాత్కరించిన మాధవ్ శృంగారఘట్టంపై ఎందుకు పారిపోయారన్నది తెదేపాయుల ప్రశ్న.

rajuసహజంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎంపీ చిక్కుల్లో ఉన్నప్పుడు సీఐడీ ఎలా వ్యవహరిస్తుందన్నది మరో ప్రశ్న. సోషల్‌మీడియా వ్యవహారాల్లో జడ్జిలను దూషించిన వారిని మినహా.. మిగిలిన ఫిర్యాదులపై వాయువేగంతో స్పందించే సీఐడీ, మాధువుడి శృంగార వీడియోలను ఫార్వర్డ్ చేసిన కోట్లాదిమందిని అరెస్టు చేస్తుందా? లేక అసలు ఆ వీడియో ఒరిజనలా? లేక డూప్లికేటా అన్నది తేలుస్తుందా? ఒకవేళ ఆయన వీడియో ఫార్వర్డ్ చేసిన వీడియోలను షేర్ చేసిన వారిని అరెస్టు చేయాలంటే, ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పినట్లు మన దేశంలోని జైళ్లు సరిపోవు.

మరి మోదీతో మాట్లాడి పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, చైనా జైళ్లకు పంపిస్తారేమో చూడాలి. ఎందుకంటే.. ఇప్పటివరకూ వీడియోలను పంపిన షం‘షేర్’శంకర్లను జైల్లో పెట్టారు కాబట్టి, మాధవుడి కేసులోనూ అదే సంప్రదాయం పాటిస్తారా? లేదా? అన్నది చూడాలి.

LEAVE A RESPONSE