Suryaa.co.in

Telangana

పన్ను నొప్పా..పన్నుల నొప్పా..

▪️ ప్రభుత్వంలో ఉన్నవాళ్లు పరిష్కరించాలి కానీ.. ప్రశ్నించడమేంటి??
▪️ ముఖ్యమంత్రి ఢిల్లీలో పండుకుంటాడు.. ప్రధాని కలవడు??
▪️ ప్రజాసమస్యలపై పోరాటం చేసే కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ లను ఖండిస్తున్నా
– ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రైతుల సమస్యలు పరిష్కరించకుండా పన్నునొప్పి పేరుతో తన అక్రమాల, అవినీతి సొమ్ములకు వచ్చే పన్నుల నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో ఉన్నాడు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది నొప్పి కాదు.. వచ్చింది పన్నులు నొప్పి మాత్రమే. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు సిగ్గులేకుండా ధరల పెరుగుదలను జాతీయ రహదారులను దిగ్బంధిస్తూ ప్రజలను, ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీలో పండుకుంటాడు.. ప్రధానిని కలవడు.. వీళ్లు మాత్రం రోడ్ల మీద ధర్నా చేస్తారు..ప్రభుత్వంలో ఉన్న బీజేపీ-టీఆర్ఎస్ లు సమస్యలను పరిష్కరించాలి కానీ.. వాళ్లే ప్రశ్నిస్తే.. సమస్యలను ఎవడు పరిష్కరించాలి…?? పరిష్కరించాల్సినోళ్లే ధర్నాల పేరుతో రోడ్ల మీద డ్రామాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తే అరెస్టులు చేస్తారా?? పెంచి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని.. ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లలో ఏనాడైనా ఇంధన ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ ను తగ్గించాడా??కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించి ప్రజలకు ఊరటనిస్తే.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎందుకు తగ్గించలేదో ప్రజలకు చెప్పాలి.

LEAVE A RESPONSE