– రాజమండ్రి రూరల్ కొంతమూరులో వినాయక మందిరంలోకి చెప్పులు వేసుకుని ప్రవేశించి గుడిని ద్వంసం చేసిన క్రైస్తవ పాస్టర్ పై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
– నియంత్రించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంది
– హిందూ దేవాలయాలను వ్యాపార సముదాయాలుగా భావిస్తున్నారు
– బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
రాష్ట్రంలో హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏదైనా చర్యలు జరిగినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు.
నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో ఏదో ఒక ఘటన ద్వారా ప్రభుత్వ అసమర్థత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దేవాలయాలపై దాడులు జరిగిన ప్రతిసారీ కంటితుడుపు చర్యలకు దిగడం తప్ప ఇలాంటి హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంఘవిద్రోహ శక్తుల పాలిట సరైన చర్యలు తీసుకునే శక్తి సామర్ధ్యాలు ప్రభుత్వానికి లేవని భావించాల్సి ఉంది.
హిందూ దేవాలయాలను వ్యాపార సముదాయాలుగా భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం జరిగిన ఘటనకు కారకులైన వ్యక్తులపై చర్యలకు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, దేవాలయాలపై దాడులను నిలువరించలేని ఈ ప్రభుత్వంపై, రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు నిర్మాణం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పరాకాష్టకి చేరిన మత మాఫియా పిచ్చి. ఏపీ లో క్రైస్తవ పాస్టర్ దుర్మార్గం కొంతమూరు రాజమండ్రి రూరల్ వినాయక మందిరంలోకి చెప్పులు వేసుకుని ప్రవేశించి, గుడిని ద్వంసం చేసిన దృశ్యం రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు .