-ఉచిత బియ్యం కోసం బిజెపి రాష్ట్రవ్యాప్త ఆందోళన విజయవంతం
-బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
అమరావతి.. కరోనా సమయం నుండి కేంద్రం ప్రభుత్వం నేరుగా ఉచితంగా రేషన్ కార్డు దారులకు ఇస్తున్న ఉచిత బియ్యాన్ని వైసీపి ప్రభుత్వం నిలిపి వేయడంతో బిజెపి ఆందోళన బాట పట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏక కాలంలో పౌరసరఫరాల కార్యాలయాలవద్ద ధర్నాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.రాష్ట్ర రాజధానిలో నిర్వహించిన ధర్నాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పాల్గొన్నారు.
ఈసందర్భంగా బిజెపి శ్రేణులనుద్దేశించి సోమువీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోంది రేషన్ బియ్యం దగ్గర నుండి ఇసుక వరకు అదేవిధంగా రెడ్ శాండ ల్ దగ్గర నుండి మద్యం వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. మిల్లర్లు ప్రభుత్వం కుమ్ముక్కు అయ్యారని అందువల్లే ఉచిత బియ్యం పంపిణీ చేయడం లేదని అయితే కేంద్రం బియ్యం కోసం ఇచ్చిన నగదును ప్రభుత్వం ఏం చేస్తోందని డిమాండ్ చేశారు.
మోదీ అన్న యోజన బియ్యాన్ని ప్రతీనెల 15న రాష్ట్రం ఇవ్వాలి.నాలుగు నెలలుగా మోదీ అన్నయోజన బియ్యం ఇవ్వడం లేదు,ఇప్పటికైనా ఇవ్వకపోతే దిగువ స్ధాయి వరకూ తీసుకెళతాంనాలుగు కోట్ల మంది పేదలున్నారన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వాలి.నీతీ ఆయోగ్ లెక్కల ప్రకారం 86కోట్లకు మూడు రెట్లు పేదలున్నారు రాష్ట్రంలో సివిల్ సప్లై మంత్రి ఈ అంశంలో వెటకారాలు మాట్లాడుతున్నాడు. మోదీ ఇచ్చిన బియ్యాన్ని రాష్ట్రంలో అమ్మేసుకుంటున్నారా,ఏపీలో అధికారులు నిజాలు చెప్పడానికి భయపడుతున్నారు.పేదల బియ్యానికి ఇచ్చే నిధిని కూడా రాష్ట్రం వాడుకుంటోంది.
కేంద్రం ఇవ్వడం లేదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు..
బిజెపి కార్డు హోల్డర్ దాకా మీ అబద్ధాలు బట్టబయలు చేస్తుంది.రాష్ట్రం అదనంగా కార్డులు వైఎస్ఆర్ సీపీ వాళ్ళకి ఇచ్చిందా అని ప్రశ్నించారు.బియ్యం అమ్ముకునే వాళ్ళకు కార్డులిచ్చింది రాష్ట్రం,కాకినాడ పోర్టు నుంచీ ఎక్స్ పోర్ట్ అవుతున్న బియ్యం ప్రజలకివ్వాల్సిన బియ్యమేనా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఏపీలో పెద్ద మోసం జరుగుతోంది.పేదవాళ్ళు బియ్యం ఎందుకు అమ్ముతున్నారు,1400 కి కొనమంటే.. 1100 కి కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిల్లర్ల ప్రభుత్వంగా సోము వీర్రాజు అ’భివర్ణించారు. మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ,సివిల్ సప్లై కార్పొరేషన్ అధ్యక్షుడిని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సివిల్ సప్లై కార్పొరేషన్ అధ్యక్షుడు భాస్కర రెడ్డి కాకినాడ ఎంఎల్ఏ తండ్రి అని వివరించారు .
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి బిజెపి శ్రేణులతో కలసి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు వెళ్లి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఉచిత బియ్యం ఎప్పడు ఇస్తారంటూ నినాదాలతో హోరెత్తించారు. అదే సమయంలో ప్రభుత్వంతో వీడియో కాన్ఫెరెన్స్ లో ఉన్న సివిల్ సప్లైయిస్ జాయింట్ డైరెక్టర్ రంగకుమారి వెంటనే బిజెపి నాయకుల వద్ద కువచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉచిత బియ్యం విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటని నిలదీశారు . ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వెంటనే కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని పేదలకు వెంటనే ఇవ్వాలన్నారు లేదంటే ఈ ఉద్యమం మరింత గా నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాబ్జి,జిల్లా అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు, రేగళ్ల రఘునాధ్ రెడ్డి, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కునాల యుగంధర్, తెన్నేటి ఇమ్మనియెల్, బసవ పూర్ణిమ, అవ్వారు బుల్లబ్బాయి, BSK పట్నాయక్, మాతంగి ప్రకాష్, బొమ్మదేవర రత్నకుమారి మాతంగి లక్ష్మీ ప్రసన్న, హరి శ్రీదేవి, భోగవల్లి శ్రీధర్, కాజా కిరణ్, డాక్టర్ హనుమంత రావు, ks ఆర్ముగం, నాలం ఠాగూర్, పొట్టి శ్రీహరి, రవ్వా హరీష్, బోనం రామి రెడ్డి, పోతురెడ్డి వెంకట్, నుసెట్టి రంగా రావు, షేక్ మౌలాలి, నిడుమోలు సుబ్రమణ్యం, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.