– అలాంటప్పుడు కేసీఆర్ దీక్ష గురించి ఆయనకెలా తెలుస్తుంది ?
– గాంధీ దేశానికి ఏట్లో తెలంగాణ కు కేసీఆర్ అట్లా
– సింహం తన చరిత్ర ను చెప్పనంత కాలం వేటగాడు రాసుకున్నదే చరిత్ర అవుతుంది
– తెలంగాణ భవన్ లో విజయ్ దివస్ వేడుకలు .
– .మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ , మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, బీ ఆర్ ఎస్ నేత జి.దేవీప్రసాద్
హైదరాబాద్: ఉద్యమ స్ఫూర్తి తో వచ్చిన తెలంగాణ ను కేసీఆర్ అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చేశారు. పదేళ్ల కేసీఆర్ తెలంగాణ ను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దారు. రెండేళ్ల లో వికాసం పేరిట రేవంత్ రెడ్డి విద్వంసం చేశారు. తెలంగాణ ను విద్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లేందుకు మళ్ళీ కేసీఆర్ నాయకత్వం అవసరం. కేసీఆర్ ను మళ్ళీ ఈ రాష్ట్రానికి సీఎం ను చేసుకునేందుకు విజయ్ దివస్ ను స్ఫూర్తిగా తీసుకొని పని చేయాలి
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉద్యమం లోనే పాల్గొన లేదు .అలాంటపుడు కేసీఆర్ దీక్ష గురించి ఆయనకెలా తెలుస్తుంది? అంబేద్కర్ రాజ్యాంగం మూడో ఆర్టికల్ ఆధారంగానే కేసీఆర్ తెలంగాణ సాధించారు. తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్ కు రేయింబవళ్లు హరీష్ రావు లాంటి వారు ఎందరో వెన్నుదన్నుగా ఉన్నారు. మనం నిజాల గురించి చెప్పనంత కాలం అబద్దాలు చెప్పే వారిదే చరిత్ర అవుతుంది
కేసీఆర్ తెలంగాణ పోరాటం చేయక పోతే 200 యేండ్లు అయినా తెలంగాణ వచ్చేది కాదు
గాంధీ దేశానికి ఏట్లో తెలంగాణ కు కేసీఆర్ అట్లా. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ వక్రీకరిస్తోంది. సింహం తన చరిత్ర ను చెప్పనంత కాలం వేటగాడు రాసుకున్నదే చరిత్ర అవుతుంది. నిన్ననే సీఎం సోనియా మన్మోహన్ వల్లే తెలంగాణ కల సాకారం అయిందంటున్నారు.
కేసీఆర్ పోరాడకుంటే తెలంగాణ వచ్చేదా?1969 లో ఎందుకు తెలంగాణ రాలేదు? తొలి ఉద్యమం లో పోలీసుల కాల్పుల్లో మన పిల్లలు మరణించారు. అవి ఎన్కౌంటర్లే. మలి ఉద్యమం లో యువకులు బలిదానం చేసుకున్నారే తప్ప ఎవర్ని ఏమనలేదు.