-గ్రామంలో ప్రతి ఒక్కరు ఇది తమ బాధ్యతగా తీసుకోవాలి
-పట్టీలు వేసుకోకుండా కేజ్ వీల్ వాహనాలు బిటి రోడ్లపై తిరుగకూడదు
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ నియోజకవర్గం: భీంగల్ మండలము దేవక్క పేట నుండి కారేపల్లి వరకు ఇటీవల నూతనంగా వేసిన బిటి రోడ్ పై కేజ్ వీల్ నడిచిన గుర్తులు చాలా ఉండటంతో వాహనం ఆపి పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.కోట్ల రూపాయలతో ప్రభుత్వం రోడ్లు వేస్తుంటే పట్టీలు లేని కేజ్ వీల్ వాహనాలను నడిపి రోడ్లను నాశనం చేయడం సరికాదని,ఆ వాహనాలను నడుపుతున్న యజమానులకు అవగాహన కల్పించాలని అక్కడే ఉన్న పోలీస్ సిబ్బందికి మంత్రి ఆదేశించారు.
ఏ గ్రామానికి ఆ గ్రామంలోని గ్రామస్థులంతా సమావేశం ఏర్పాటు చేసుకోని రోడ్లపై కేజ్ వీల్ వాహనాలను పట్టీలు లేకుండా నడపమని తీర్మానాలు చేసి తీర్మానం కాపీని మండల తహశీల్దార్ కు అందజేయాలి అన్నారు.గ్రామాలు తీర్మానం చేసుకోనంతవరకు ఆ గ్రామాల గుండా వేయాల్సిన బిటి రోడ్లు ఉంటే ఆ పనులను ప్రారంబించొద్దు అని అధికారులకు మంత్రి సూచించారు.